Others

కర్మలు - ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుట్టుకనుండి మరణం వరకు జరిగేది జీవన ప్రయాణం. కర్మను బట్టి జీవికి జన్మ పరంపరలు వస్తూనే ఉంటాయ. ఎవరికైతే పుణ్య పాపాలు నశిస్తాయో వారికి మళ్లీ జన్మంటూ ఉండదు. కానీ చాలా మంది కోరికలతోను, ఆ కోరికలు తీరడానికి పడే కష్టంలో భగవం తుడిని నమ్ముకున్నా నన్ను నేను అనే మాటలను వదలలేక తిరిగి తిరిగి జన్మను పొందుతూనే ఉంటారు. ఈ జనన మరణ చక్రంలో చిక్కుతూనే ఉంటారు. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం గొప్ప అదృష్టం. జన్మరాహిత్య సాధనకై దొరికిన సువర్ణ అవకాశంగా భావించాలి.సహజంగా మనిషికున్న వివేచనాదృష్టి వల్ల జన్మ రాహిత్యానకై పాటుపడుతుంటాడు.
సాధారణంగా మానవులు త్రిగుణాల మాయా బంధితులు. రజ, తమోగుణాలతో అహంకార, మమకారాలచే జనించిన రాగ ద్వేషాలతో ప్రవర్తించడమనేది చాలా సహజం. సృష్టికి భగవంతుడే కారణమనితెలిసి ఉన్నా సరే మేమే సృష్టికి కారణం మేము లేకపోతే సృష్టి ఎలా జరుగుతుందనే కారణం చూపిస్తూ హేతువాద బుద్ధితో చెబుతున్నామం టారు. కానీ భగవంతుని కృప లేనిదే ఏ మనిషి కూడా తన మానవ జన్మను పొందలేడు. మానవ జన్మనే కాదు ఈ చరాచర జగత్తులో ఏ జీవి పుట్టలేదు. ఇది నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
‘పెట్టి పుట్టారు’ అని లోకంలో జీవనం బాగా జరుగుతున్న వారిని చూసి అంటుంటారు. ఈ మాట నిజమే! గత జన్మలో చేసిన మంచి కర్మలే ఈ జన్మలో మంచిజీవనానికి దారి చూపు తాయ. ఒకవేళ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురైతే ఇవన్నీ కూడా క్రితం జన్మ లోని కర్మల ఫలితాలే. ఇవి పోగొట్టు కోవడానికి ఎలా కష్టపడుతామో అదే విధంగా భగవంతుని పైన కూడా విశ్వాసం ఉంచి భగవంతుని ధ్యాని స్తూ, స్తుతిస్తూ ఉంటే తప్పక కష్టాలు, ఇబ్బందులు దూరమవుతాయ. బాకు తో తగలాల్సిన దెబ్బ చిన్న గుండు సూది తగిలి నట్టుగా తగిలి దూరమవుతుంది. ఇది భగవంతుని నమ్మినవారికి వారి పూర్వ జన్మ కర్మలు దూరమయ్యేస్థితి అన్నమాట.
పాండవులు కురుక్షేత్ర యుద్దం జరిగేటపుడు ఎదుటి పక్షంవారు వేసిన శరాఘాతాలకు పాండవులల్లో ముఖ్యంగా అర్జునుడు ఆయన రథం ఎపుడో కాలి బూడిద అవ్వాల్సినవారు. కానీ అర్జునుడు తన జీవితానికి తన సమర సంగ్రామానికి రథసారథిగా ఉండమని భగవంతుడిని కోరుకు న్నాడు కనుక ఆయనకు ఎదుటివారి శరాల దెబ్బలన్నీ చిన్నచిన్న దెబ్బలుగా ఉంటూ ఉండి, చివరకు విజయ లక్ష్మిని అందేట్టు చేసింది. కనుక మనమూ ఆ భగవంతుడిని నమ్ము దాం. మన కర్మల తాలూకూ ఫలి తాలను దూరం చేసుకొని భగవం తుని సన్నిధికి చేరుకుందాం.

- ఆర్. పురందర్