Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. బాహ్య సౌందర్యమది యేల? ఫలితమెన్న
శూన్యమగు ఁగానఁ జూడంగ సొంపు మీరు
నదియు నాత్మ సౌందర్యమ్ము ; హృదయ పద్మ
వికసితంబైన నద్దాని విలువ పేర్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఆలోచిస్తే బాహ్య సౌందర్యం వల్ల ఫలితం శూన్యమే నని తెలుస్తుంది. అది దశానుక్రణికలో కనబడకుండా పోతుంది. ఇంపైనది , చెక్కు చెదరనది ఆత్మసౌందర్యం మాత్రమే. వికసించిన హృదయ పద్మముల విలువ ఎంతని చెప్పగలం? బాహ్యసౌందర్యం కోసం కాక ఆత్మసౌందర్యం కోసం చూడాలని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! నీవైనా ఈలోకానికి తెలియజెప్పుమయ్యా! ప్రభాకరా!
తే.గీ. మనసు గెలిచినఁజాలదా? మణులవేల?
మనసు కరగినఁ జాలదా ? కనగఁ జగతి
మహిన వెలుగొందు స్వర్గంబు దిగియువచ్చుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!
భావం: ఇతరుల మనసులు గెలవాలి. మన మనసులు కరగాలి. మంచి మనసుతో మనుషులంతా పుడమిపై ప్రకాశించాలి.మంచితనం, మరియు జాలిగుణం మనం కూడ గట్టుకున్న పక్షంలో పైనుండి స్వరగమే దిగి వస్తుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి తెలియజేయుమయ్యా దినకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262