Others

కర్మాకర్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మ అంటే పని. మనం చేసే కర్మలనుబట్టే ముందుజన్మ ఉంటుందని భగవద్గీతలో ఏనాడో శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు. అందుకే అంటారు ఎవరికైనా ఏదైనా మంచి జరిగితే అది అతడి పూర్వజన్మ సుకృతం అని, కీడు జరిగితే అది వాడి కర్మ అని.
కర్మలు లౌకిక కర్మలని, వైదిక కర్మలని రెండు రకాలు. మన శరీర పోషణకు, మనపై ఆధారపడ్డ వారి జీవనానికి మనం చేసే పనులన్నీ లౌకిక కర్మలని కర్మలక్రిందకు వస్తాయి. ఆత్మోద్ధారణకు సమాజ శ్రేయస్సు కోసం మనం చేసే పూజలు, జపతపాలు లాంటివి వైదిక కర్మల కోవలోకి వస్తాయి. మతాచారాలకు లోబడి స్వధర్మాల్ని చక్కగా నిర్వర్తించాలన్నది వీటి ముఖ్యోద్దేశ్యం.
రెండవ విభజన విభజన విషయానికి వస్తే కర్మలు మూడు రకాలు. అవి కాయక, మానసిక, వాచిక కర్మలు. చివరిగా కర్మలు నిత్యకర్మలని, నైమిత్తిక కర్మలని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ప్రతిదినం శరీరాన్ని కాపాడుకోవడం కోసం చేసేవి నిత్యకర్మలు. మనిషికి ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. సర్వసంగ పరిత్యాగి అయినా ఎంతో కొంత ఆహారం తీసుకోవలసిందే. ఎందుకంటే, అన్నము, నిద్ర శరీర పోషణకు ఎంతో అవసరం. అలాగే ఆత్మసుఖానికి మత సంబంధమైన కర్మలు చేయడం కూడా అంతే ముఖ్యం. అవే స్నానం, సంధ్య, ప్రార్థన ద్వారా నిత్య కర్మలు చేయడంవల్ల అంతఃకరణ శుద్ధి. తద్వారా జ్ఞానమార్గం కలుగుతుంది. అనంతరం మంచి జన్మ ఎత్తడానికి వీలవుతుంది. నైతిక కర్మల విషయానికి వస్తే అవి పితృకార్యాలు, పర్వదినాల్లో చేసే పితృతర్పరణలాంటివి. చివరిగా కర్మల్ని నిషేధ కర్మలు, కామ్యకర్మలని రెండు రకాలుగా విభజించవచ్చు. అబద్ధాలాడడం, పర స్ర్తి వ్యామోహం కలిగివుండడం, ఇతరుల సొమ్ముకి ఆశపడడం, మద్యపానం లాంటివి. వీటిని ఎవరూ ఆచరించకూడదు. ఎవరినీ ప్రోత్సహించకూడదు. చెరపకురా చెడేవు అన్న సామెత ఉండనే ఉన్నది కదా!
శ్లో కార్థేన ప్రవష్యౌమయ దుక్తం గ్రంథకోటిభిః
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పబడింది. ఒకర్ని బాగుచేస్తే నువ్వు బాగుపడతావు. ఒకరికి అపకారం చేస్తే నువ్వు చెడిపోతావు అని భావన.
ప్రత్యేక ఫలాన్ని ఆశించి చేసే పనులన్నీ కామ్యకర్మలు అనబడతాయి. ఫలాపేక్ష లేకుండా చేయడం నివృత్తిమార్గం. మన వేదాలన్నీ నివృత్తి మార్గంలో కర్మల్ని చేయమని బోధిస్తున్నాయి.

-దూరి వెంకటరావు