Others

లెక్క తేలేనా? ఋణం తీరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ
తల్చుకుంటేనే చాలు కదా ఆమె ఒక
అపురూపం, అమూల్యం
అద్వితీయం, ఇలా ఎన్నో విశేషణాలు
లెక్కేలేదు...
అమ్మ
భవిష్యత్తు కు పునాది
అసలు ఉనికికే ఆది
అమ్మ గదా!
అలాంటి అమ్మ ఋణం తీరేనా?
ఋణం తీరాలంటే లెక్కతేలాలి కదా
మరి ఎక్కడ నుంచి మొదలు లెక్క

పేగు తెంచి రక్తాన్ని పాలగా మార్చి
ఆకలిని తీర్చినప్పటి నుంచా?
అమ్మా అన్న పిలుపుకు కరిగిపోయి
పరుగెత్తుకు వచ్చి నిలిచిన చోటు నుంచా?
అప్యాయతా అనురాగాలను
పంచిన రోజునుంచా?
పుట్టిన క్షణం నుంచి మొదలెట్టిన సేవకులెక్కనా?
వృద్ధాశ్రమాలకు పంపిన క్షణమైనా
చిరునవ్వుతో జాగ్రత్త బాబూ..
అన్నంత వరకూనా?
లేక జీవితాంతం తనకు స్పృహఉన్నంత వరకు
మన శ్రేయస్సును కాంక్షిస్తున్నంత క్షణం వరకునా?

ఈ లెక్కకు ఎక్కడ ఆది మరెక్కడ తుది?
మరి
ఈ లెక్క తేలేనా? ఈ ఋణం తీరేనా?

- ఆర్. పురందర్