AADIVAVRAM - Others

మననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంక్రీటు వనంలో కప్పెట్టిన ప్రకృతీ
గాలిలో తేలు కల్మషాన్ని కరిగించక
ఎడారి వేడిగాలి తాకిడులు తగ్గించలేక
నీటికై చాచిన నోటికి అందించబోక
పచ్చందనాలు లేని రాయిపరాయి మా నగరం!
బుధులు హితపురోహితులు నెలవైన
మేధోమధనాల చారిత్రక గమనాల
నిత్య ఉద్యమాల పోరాటాల ఆవిష్కరణాలున్నా
ప్రకృతి ప్రతీకృతీ పరిపుష్టి దృష్టిపెట్టు
దీర్ఘకాలిక సృష్టి ఎంతో దూరం అగమ్యగోచరం!
అప్పుడప్పుడు వనాలు పెంచు ఆవేశ నినాదాల
బాలారిష్టాల్లో దగ్ధం భగ్నవౌతుంటాయ్
పేపర్లలో తేలి ఆచరణావరణ అవకరాలు
కంసుని కారాగార గృహాల్లోనే మా నివాసాలు
ఋతుగతులన్నీ మళ్లీ వరదల ముంచివేతలు!
నగర గంగిగోవుకు నిత్యం దండాలెట్టి
కాళ్లకు తాళ్లుకట్టి నోటికి బుట్ట అడ్డుకట్టి
పాపపుపాలు పిండుకునే పంట పండించుకునే
మచ్చుకైన పచ్చపచ్చదనం లేనిది మా నగరం!!
మట్టి మొత్తం కప్పెట్టిన గర్భీకరణ ప్రశ్నార్ధకంతో
మనిషికి మాత్రమేచోటన్న మొక్కలేని నిశ్శబ్దం!!
మననం చేసుకుంటుంటే వాస్తవాన మా నగరాన
ప్రకృతి తలలూపుతూ నిలిచే కలకాలపు కలవంటిది!!

- యల్.రాజాగణేష్, 9247483700