AADIVAVRAM - Others

ఈ విధ్వంసాన్ని ఏ‘మనాలి’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత సుందరమైన మనాలి ప్రాంతం ఇపుడు కళావిహీనంగా దర్శనమిస్తోంది. మనాలి పరిసర ప్రాంతాలలో పేరుకొన్న వ్యర్థాలలో అధికశాతం పర్యాటకులు పారవేసే ప్లాస్టిక్ పదార్థాలే. ఒకప్పుడు పర్యాటకులను అలరించిన మనాలి ప్రాంతంలో ఇపుడు ఎటుచూసినా ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ కవర్లు గుట్టల కొద్దీ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ భారీగా పేరుకుపోతున్న చెత్త కుప్పలను తొలగించడం స్థానిక అధికారులకు తలనొప్పిగా మారింది. పర్యాటకుల తాకిడి ఎక్కువగా వున్నపుడు మనాలిలో రోజుకు 25 టన్నుల చెత్త పేరుకుంటుంది. వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఆలోచన కార్యరూపం దాల్చడంలేదు. గత ఏడాది మే, జూన్ నెలల్లోనే రెండు వేల టన్నుల వ్యర్థ పదార్థాలు మనాలి పరిసర ప్రాంతాల్లో పేరుకున్నాయి. పర్యావరణం పట్ల పర్యాటకులకు ఎటువంటి శ్రద్ధ లేకపోవడానికి ఈ పరిస్థితి తెలియజేస్తోంది. మనాలితో పాటు కోసల్, తోష్, సోలంగ్, హిడింబ ఆలయం తదితర ప్రాంతాల్లో కూడా పర్యాటకుల కారణంగా చెత్తకుప్పలు పేరుకుంటున్నాయి. చెత్తను సేకరించి పవర్ ప్లాంట్‌లలో దగ్ధం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళిక కార్యరూపం దాల్చడం లేదు. సరైన డంపింగ్ యార్డ్ వ్యవస్థ లేకపోవడం వల్ల స్థానిక అధికారులు వ్యర్థపదార్థాల నిర్వహణలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనాలి నుండి ధర్మశాల తదితర ప్రాంతాలకు వెళ్ళే మార్గాలు నిత్యం పర్యాటకుల తాకిడితో కనిపిస్తాయి. వారు వాడి పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థపదార్థాలతో అక్కడి పరిసరాలు నానాటికీ కలుషితమైపోతున్నాయి.