AADIVAVRAM - Others

బహుళ అంతస్థులు క్షణాల్లో బూడిద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీర ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాల పట్ల స్థానిక సంస్థలు అలసత్వం ప్రదర్శిస్తున్నందున ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవలసి వస్తోంది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మరడు పట్టణంలో బహుళ అంతస్థుల భవనాలను కోర్టు ఆదేశాల ఫలితంగా కూల్చివేయడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తీరప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని బహుళ అంతస్థుల భవనాలను నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో వాటిని కూల్చివేయాలని సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీచేసింది. కొచ్చి నగరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో వున్న మరడు పట్టణంలో ఇటీవలికాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భవన నిర్మాణాలు ఎక్కువ కావడంతో ఈ గ్రామ పంచాయితీని 2010లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. వెంబనాడ్ సరస్సుకు సమీపంలో వున్న ప్రాంతంలో నాలుగు అపార్టుమెంట్లు కట్టేందుకు 2006లో అప్పటి పంచాయితీ పాలకులు అనుమతి మంజూరు చేశారు. కానీ తీర ప్రాంతంలో నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. రియల్ ఎస్టేట్ సంస్థలు మాత్రం అపార్టుమెంట్లు పూర్తిచేసి వినియోగదారులకు అందజేశాయి. అయితే సముద్ర తీరం నుంచి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టరాదని కేరళ తీర ప్రాంత అధారిటీ గతంలోనే ఆదేశించింది. దానిపై 2007లో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2012లో జారీచేసిన నోటీసులను కోర్టు కొట్టివేయడంతో కేరళ ప్రాంత అథారిటీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర ప్రాంతంలో అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడంలో స్థానికులు అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ తేల్చింది. పంచాయితీ ఇచ్చిన అనుమతులు చెల్లవని, తక్షణం అపార్టుమెంట్లు కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొద్దిరోజుల క్రితం జిల్లా అధికారులు ఈ భారీ అంతస్థుల భవనాలను ఒక్కసారిగా నేలమట్టం చేశారు. చుట్టుప్రక్కల ఇళ్లకు ఎటువంటి నష్టం జరుగుకుండా బాంబులు అమర్చి ఈ అపార్టుమెంట్లను క్షణాల్లో కూల్చివేయడం సంచలనం సృష్టించింది.