Others

ఫస్ట్‌లుక్‌లో మిస్టర్ అండ్ మిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్’. జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ- తెలుగు కథలు రియలిస్టిక్ వైపు పరుగెడుతున్నాయని, యువతకు నచ్చే అంశాలతో సహజత్వంగా సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు. ఈ జనరేషన్ ప్రేమకథతో ఓ ఇంటిపెండెంట్ అమ్మాయి కథనంతో సాగే ఈ చిత్రంలో హీరో పాత్ర నేటి యువతరానికి రిలేటెడ్‌గా వుంటుందని తెలిపారు. ఓ గ్రామీణ నేపథ్యానికి చెందిన కుర్రాడు, ముంబైకి చెందిన మోడరన్ యువతితో రిలేషన్‌లో వుంటే ఎలా వుంటుంది? ఒకరి మొబైల్ మిస్ అయితే ఆమె మిస్ అయిన మొబైల్ వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది అనే యువతరానికి నచ్చే కంటెంట్‌తో ఈ చిత్రం సాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తుందని, చిత్రం కూడా ప్రతిఒక్కరికీ నచ్చే అంశాలతో రూపొందిందని ఆయన వివరించారు. ఈ చిత్రానికి సంగీతం యశ్వంత్ నాగ్, కెమెరా సిద్ధం మనోహర్ అందిస్తున్నారు.