Others

నీల గగన ఘనశ్యామా (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీల గగన ఘనశ్యామా/ ఘన శ్యామా దేవా/ నీల గగన ఘన శ్యామా.. హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునదీ నీవేకావా.. చదువులు హరించి అసురండేగిన జలచరమైతివి ఆగమ రూపా/ వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవేకావా.. కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి/ అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవేకావా.. సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగ నేరము/ పెండ్లికొడుకువై వెడలినాడవు ఎందులకొరకో హే జగదీశా.. -‘చెంచులక్ష్మి’ చిత్రం కోసం ఆరుద్ర అందించిన పాట ఇది. సాలూరు రాజేశ్వరరావు ‘బేహాగ్’ రాగంలో కట్టిన బాణీని ఘంటసాల గానం చేశారు. సినిమాలో నారద పాత్రధారి రేలంగిపై చిత్రీకరించారు. అప్పట్లో ప్రతి పౌరాణిక చిత్రంలోనూ నారద పాత్రను సృష్టించేవారు. లేకపోతే కథ రక్తికట్టదన్న భావన ఉండేది. 1950 దశకం నుండి ఈ పాత్రకు కొంత హాస్యం జోడించి వినోదాన్ని అందించేవారు. ఈ పాత్ర పోషణలో కాంతారావుకు పెట్టింది పేరు. అలాంటిది చెంచులక్ష్మిలో స్థూలకాయుడు, ఎత్తు తక్కువవుండే రేలంగి ఈ పాత్రను పోషించారు. ఆయన తరహాలోనే పాత్ర పోషించినా ప్రేక్షకులు ప్రశంసలు అందించారు. మరో విశేషమేమంటే ఏయన్నాఆర్ ఈ చిత్రంలో శ్రీ మహావిష్ణువుగా కథాపరంగా మొదట్లో, క్లైమాక్స్ సన్నివేశాల్లో నటించారు. చెంచులక్ష్మి కథను నరసింహావతారానికి అనుగుణంగా మలచుకున్న తీరుకు వెన్నుదన్నుగా నిలిచేలా పాట ఉంటుంది. పాటలో కథాగమన స్వరూపం లీలగా, నరసింహావతార విశేషం, విష్ణువు దశావతారాల లీలా విశేషాలు.. ఇలా అనేకాంశాలని దృష్టిలో పెట్టుకొని రాసిన పాట ఇది. చిత్రం ప్రారంభంలో వచ్చే పాటనువింటే కవి హృదయం స్పష్టంగా గోచరిస్తుంది. మరో విశేషాంశమేమంటే ఈ పాటకు స్వరాలందించిన సంగీత దర్శకుడు రాజేశ్వరరావు.. తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన ఏవీఎమ్ ‘్భక్తప్రహ్లాద’ చిత్రంలోనూ నారదుడు పాడే పాటను తిరిగి ‘బేహాగ్’ రాగంలోనే స్వరపర్చడం. బిఏ సుబ్బారావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నిర్మించిన ‘చెంచులక్ష్మి’ చిత్రంలోని అన్ని పాటలూ జనరంజకం. పద్యాలూ వినసొంపే.
-పీవీఎస్, అద్దంకి