Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ధర్మకార్యాలు సేయంగఁ దరల వలయు
నపుడుపుణ్యాల పంటలు నడచి వచ్చి
తరతరాలకు శుభముఁ గరమొసంగుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అంతా ధర్మకార్యాలు చేయడానికి తరలి వెళ్లాలి. అపుడు పుణ్యాలపంటలు నడిచి వస్తాయి. తరతరాలకు అనేక శుభాలను ఆ పుణ్యాలు అధికంగా ఇస్తాయని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి తెలియజెప్పుమా!ద్యుమణీ మణి.

తే.గీ. దూరదృష్టియులేకున్న నరయఁ గష్ట
నష్టములు మిక్కుటమ్ములై నలిపి వేయు
వెంతయో పట్టి కుదిపేయునిది యెఱింగి
నడుచుకొనవలె మనుజులీ పుడమి యందుఁ
జూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: దూరదృష్టి లేకుంటే కష్టనష్టాలధికమై నలిపి పారేస్తాయి. అలాగే జీవితాలను పట్టి కుదిపేస్తాయి. ఈవిషయాన్ని గుర్తించి భూజనులంతా చక్కగా నడుచుకోవాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!ఈ లోకానికి తెలియజేయుమయ్యా! ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262