Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ధనము జగతికి మూలమ్ము గనగ నిజము
ధనము సర్వ సర్వస్వమవరాదు తప్పు మాట
ధనపు మోహానఁ గష్టాలు దండిన
కావలసినది సుజనాళి కంటిరేని
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ధనం మూలమిదం జగత్ అన్నది అక్షర సత్యం. కానీ ధనమే సర్వస్వం అంటే మాత్రం అది తప్పుమాట. ధనమోహంలో పడితే కష్టాలు అధికం అవ్వడం మాత్రం నిజం. ఆలోచిస్తే అందరికీ కావాల్సింది సుజన సంపత్తి మాత్రమే అన్నవిషయాన్ని అందరికీ తెలియజేయుము సూర్యదేవా!
తే.గీ. ఎత్తులేలకో! పై యెత్తు లేలఁ గనగ
జిత్తులేలకో!చిత్తమ్ము చిత్తుకాద!
చిత్తు చిత్తగు చిత్తాన ఁ జెత్త జేరుఁ
జెత్త ఁగొనిపోదురా?స్వర్గసీమదాకఁ
జూడుమో కర్మసాక్షి! ఓ సూర్యదేవ!
భావం: ఆలోచిస్తే ఎత్తులు, పైయెత్తులు, నక్కలమారిజిత్తులు వంటివన్నీ దేనికి? వీటివల్ల చిత్తం చిత్తయిపోతుంది. అలా చిత్తు చిత్తయిన చిత్తంలో చేరేది చెత్తనే కదా!బ్రతుకు చాలించాక ఆ స్వర్గానికి ఈ చెత్తను తీసుకుపోరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియజెప్పుమా భానుమూర్తీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262