Others

భక్తి... జీవన ముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూఢనమ్మకమే అనండి, పుట్టుక నుంచి నరనరాల్లో జీర్ణించుకుపోయిన అలవాటు అనండి లేక మనస్ఫూర్తిగా మనని పాలించి, దశాదిశా గమ్యం సూచించే ఓ దివ్యశక్తి ఉందని నమ్మి తలుచుకోవడమే కానీయండి, దేవుడు అంటూ ఉన్నాడు అని నమ్మే వాళ్ల కోసమే ఈ భావ విభావరి.
భక్తి నానా రకాలు
ఈశ్వరేచ్ఛ అని త్రికరణ శుద్ధిగా నమ్మగలిగి, ప్రతి ఫలితం అంగీకరించగలగటం ఈభక్తి తత్త్వానికిపరాకాష్ఠ. మనం నిండు మనసుతో ప్రార్థిస్తే, అపైవాడు మన విన్నపాలను వింటాడు అని నమ్మటం ఇంకో దారి. ఇహ అలవాటుకొద్దీ పూజలు, సంధ్యావందనాలు, పారాయణలు చేసేవారు కొందరు. ఇవి యాంత్రికంగాసాగిపోతుంటాయి చాలా మటుకు. కాకపోతే ఈ దారిలో ఉన్న ఒక నీతి సూక్ష్మం ఏమిటి అంటే, అర్థగంట, గంట సేపు జరిగే ఈ పూజ స్మరణలో ఎంత యాంత్రికం గా అయినా ఏదోఒక క్షణం పూర్తిమనస్సు ఆ భగవంతుడి యందు లీనమై తీరుతుంది. ఆ ఒక్కక్షణం చాలు భగవంతుడి దయ కలగటానికి.
విష్ణు సహస్రనామం, లలితాసహస్ర నామం పారాయణలో వస్తుంది. మనం ఆ నామ పారాయణం చేయడం భగవంతుడికి ఇష్టమైన పని అని. అంటే ఆ పరమాత్ముడి కూడా ఒక భజన బృందం అంటూ ఉండాలి అన్న కోరిక ఉన్నది, అని అర్థమా? మరి వారు గుణాతీతులుకదా అన్న అనుమానం రావచ్చు. కదా. దానికి సమాధానం నా దయకోసం, నన్ను తలుచుకున్నా సరే, ఒక్కక్షణపుపూర్తి చిత్తం నా మీద పెడతావు కాబట్టి నాకోసం కాదు నాయనా నీకోసమే ఈపారాయణ చేయి అని చెప్పక చెప్పటం అని గ్రిహించాలి. ఈ ప్రక్రియలో కొద్దిగానైనా దృష్టి నిలపడం జరుగుతుంది. స్థూలంగా భక్తితత్వం.
మనం కాశీకి వెళ్లినా, తిరుపతి కి వెళ్లినా, లేక పర్వదినాల్లో ఏ కొద్ది పేరున్న గుడికి వెళ్లినా అక్కడి రద్దీ వివిధ వ్యాపారాల్లో ఉన్న వారి ప్రవర్తన, రక్షక బృందాల వారి తోసివేయటం, అక్కడి పూజారుల యందు కనిపించేనిర్లిప్తత, మనతోటి యాత్రీకుల చర్యలు, సాధారణ మనుష్యులకు ఒకరకమైన విరక్త్భివం కలిగించి తీరుతాయి. దేవుడు ఎక్కడ లేడు? అంతటా ఉన్నాడుకదా. ఇంట్లో కూర్చుని నాయనా, నీవేదిక్కు అని ఒక దండం పెట్టుకుంటే చాలదా అనిపించవచ్చు. ఇంకోటి కూడా. దేవుడు ఉంటే ఇంత ఇబ్బంది పడుతూ యాత్రీకులు ఉండగా ఆ ఇబ్బందులను ఎందుకు తొలగించడు, ఇక్కడ జరిగే ధర్మ, నీతి బాహ్య పనులు చేసేవారిని ఎందుకు శిక్షించడం లేదు. ఆయన గుడి మెట్ల మీద కూర్చుని ఎన్నో విధాల శారీరిక, మానసిక ఇబ్బందులకు గురి అవుతున్న భిక్షకులకు ఎందుకు ఒకదారి చూపించడంలేదు అని అనిపించడమూ సహజమే. నిజమే. సర్వాంతర్యామి అయిన ఆ దేవుడికి తెలియదా ఇవన్నీ. పదోతరగతి పరీక్షల్లో ప్రతివారికీ ప్రథమస్థానంలో ఉత్తీర్ణులు కావడం జరగదు కదా. వారి వారి శ్రమ, సాధన, జవాబును పొందుపరిచే తీరు, ఏకాగ్రత బట్టి గదా ఫలితం కలిగేది. ఇదీ ఇంతే కారణమేదైనా కాశీకి వెళ్లాం. మనకి అక్కడి విశే్వశ్వరుడు ముఖ్యమా, మనకు కలిగిన అనుభవాలు అసంతృప్తి , బాహ్య అవరోధాలు ఏవగింపు ఇవి ముఖ్యమా? దైవ దర్శనం ముఖ్యం. ఇది ఒక్క క్షణంకోసం అయినా సరే, మిగతావి అన్నీ అనవసరం అన్న ఏకాగ్రత తో వెళ్లిన వారికి కలిగే ఫలితం వేరు అందరూ వెళ్తున్నారు. నేనూ వెళ్తున్నాను వచ్చే ఫలితం వస్తుంది అని సందేహాత్మకంగా సమస్యత్మకంగా వెళ్లేవారికి కనిపించే ఈ క్లిష్ట పరిస్థితులు ఒక పరీక్ష లాంటివే. ఒక పాఠం లాంటివే. బాహ్యప్రపంచం అనవసరం. వాటిని తట్టుకుని నా పై దృష్టినిలిపి నా వద్దకు రా అని చెప్పటానికే.
ఇహ గుడి మెట్ల మీద అనాథలు. వారు కేవలం తమ భుక్తి కోసం ఆ మెట్లను ఆశ్రయిస్తే ఆ మెట్ల వరకేపరిమితం అవుతారు. కాక దేవుడా, నీ ఆశ్రయం కోరి వచ్చాం. కరుణించు అనివస్తే వారి గతి వేరు.
ప్రత్యేకంగా ఇక్కడికే ఎందుకు వెళ్లాలి అంటే.. మొదటిగా ఆ ప్రత్యేకత మీద నమ్మకం ఉంటేనే అక్కడికి వెళ్లిన దానికి ఫలితం. లేదూ మనస్ఫూర్తిగా నా మనస్సునందు ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఏ గుడికి, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ మన పిల్లలను ఎల్లవేళలా చూడాలని అనిపించినట్లుగానే దేవుడు కూడా మన మనస్సులోనే ఉంటాడు గనుక ఒక్కసారి చూచి రావాలన్న ఇచ్ఛకోరిక ఏర్పడుతుంది. అలా కలిగిన వారు నిజమైన భక్తులు అనే అనుకోవచ్చు. వారికి అక్కడ కలిగే ఇక్కట్లు అసలు దృష్టికి రావు పైగా వారిని ఎంతోకష్టం లో ఎదురైనా అతిసునాయాసంగా ఆ దేవుడే తన నెలవుకు తీసుకొని వెళ్లాడన్న తృప్తి కలుగుతుంది. సంతోషమూ కలుగుతుంది.
విరక్తి: భోగి కాని వాడు యోగి కాడు అని ఒక నానుడి. భోగాలు అన్నీ అనుభవించి వాటి మీద విరక్తి కలిగితే ఆ పరిస్థితి వేరు. లేదూ కొందరు గుడికి వెళ్లినా, పుణ్యక్షేత్రాలకు వెళ్లినా అక్కడ దేవునిపైన కాక ఇతరాలపైన దృష్టికలుగుతూ ఉంటుంది. ఇతర మానవులు కనిపించగానే వారు భౌతిక అందచందాలు, వారి భౌతిక సంపద గురించి ఆలోచనలు. అంటే మిగతా ప్రపంచం గురించి విరక్తి లేనట్లే కదా. జీవన్ముక్తి ఎక్కడో లేదు మోక్షం మనలోనే ఉంది. ఎక్కడో స్వర్గం ఉంది అక్కడికి చేరాలి, పునర్జన్మ ఉండగూడదు అని కోరుకునేవారు కోకొల్లలు కనిపిస్తుంటారు. కానీ చనిపోయే క్షణాన దేవుడా! తండ్రీ! ఈ దేహంతో ఈ జన్మనిచ్చావు. తప్పులు చేసి ఉండవచ్చు. నేను చేయగలిగిన మంచి కూ డా చేసాను. తోటివారికి, నాకు మంచి పని అనిపించింది చేశాను. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. నన్ను అనుగ్రహించు అని తృప్తిగా మరణించగలిగితే చాలు అదే మోక్షం. అదికాకపోతే మరలా ఇక్కడికే.

- నండూరి రామచంద్రరావు