AADIVAVRAM - Others

సంక్రాంతి పిండి వంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మడూ ఓయ్ వాట్సప్ మెసేజ్
అమ్మాయి అల్లుడూ పండక్కొస్తారంట
బియ్యం పిండికి మిషనుకి పట్టకెళ్లనా
పట్నం నుండి స్వీట్లు పట్టుకురానా
అహ్ ఏంటొనండి ఆ రోజుల్లో అయితే...

పొద్దు పొడవని ప్రాతఃకాల ప్రభాతాన
మంచు ముసుగేసుకొని హేమంతాన పల్లెంతా!
చలిమంటలు పొగమంచుతో గెలుపుకు పోరులో
అమ్మ పిన్ని ఎల్లమ్మ పుల్లమ్మ చలికి బెదరక

రోలుకి రోకలికి పసుపు కుంకుమతో పూజజేసి
రామన్న భీమన్న క్రొత్త బియ్యం దంచేస్తుంటే
పుల్లమ్మ ఎల్లమ్మలు ఛలోక్తులతో పిండి జల్లేసి
పాకానికి చక్కెర బెల్లాలతో తయ్యారు!

ఆరుబయట పెద్ద పొయ్యిన మంటకి చలి పరారు
అమ్మలక్కల సందడితో ఇల్లంతా పండుగ కళ
గలగల సవ్వడికి పిల్లలం లేచి కళ్లొత్తుకుంటూ
పాకపు తయ్యారీ రుచి చూస్తూ నీటిన పరీక్షిస్తూ

సలిమిడి రుచి జూస్తూ అరిసెలు జేస్తూ ఓవైపు
చెక్కలు కారాలు బూంది నములుతూ ఓవైపు
రుసరుసమని అరిసెలు నూనెన కాలుతుంటె
బుసబుసమని చల్లని కట్టెలు పొయ్యిన కాలుతూ

వాయలు వాయలు అరిసెలో కారాలో దింపుతుంటె
వాయకోసారి హరిదాసులో! గంగిరెద్దులోళ్లో!
గారడీ వాళ్లో! పిట్టల దొరలో! వాళ్లెంట మేము
అమ్మేసిన వంటల వాయలు కొన్ని వాళ్లకు
వాళ్లిచ్చిన ఆశీర్వాదాలన్నీ మా కుటుంబాలకి!
సూరీడికి పిండి వంటల సువాసన అందిందేమో
నాకివ్వరూ కొన్ని రుచులు అంటూ లేకిరణాలతో
మబ్బులు దాటుతూ మంచు పొరల చీల్చుతూ
పిండి వంటలన్నీ సుతారముగ తడుముతూ
సందడి రుచులు నేనూ చూస్తానంటూ
మళ్లీ దొరికేనో లేవో ఈ పండుగ సిరులని!

-రవికిషోర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్