Others

అలా.. అన్నమాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఆధునిక యుగానికి ఆదికవి అనిపించుకున్న ‘గురజాడ అప్పారావు’ వ్రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహితీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. డబ్బులకి కన్యల్ని అమ్ముకోవడం, ముసలివాళ్లకిచ్చి ముక్కుపచ్చలారని పసిపిల్లల పెళ్లిళ్లుచేసే కన్యాశుల్కమనే దురాచారంతోపాటు వితంతు వివాహాలు, వేశ్యల్ని సంస్కరించడం వంటి సమస్యల్ని స్పృశించి యిరవై శతాబ్దపు ప్రారంభంనాటి సామాజిక పరిస్థితులపై ఫిరంగి గుండ్లను కురిపించింది. 7 అంకాలలో, 60 దృశ్యాలతో, 16 ముఖ్యమైన పాత్రలలో 6 గంటలు పట్టే రుూ నాటకాన్ని మూడుగంటల సినిమాగా కుదించడమంటే మాటలు కాదు. ‘సెల్యులాయిడ్‌లో కన్యాశుల్కం’ అన్న వ్యాసంలో మాటలను బొమ్మలుగా మార్చే శక్తి యెంతగావుంటే కన్యాశుల్కాన్ని సినిమాగా అంత గొప్పగా తీయవచ్చునని శ్రీశ్రీ భావించాడు. శ్రీశ్రీ భావించినట్లుగా అందరి ఆమోదయోగ్యంగా డియల్ నారాయణ వినోదా పతాకంపై పి పుల్లయ్య దర్శకత్వంలో ‘కన్యాశుల్కం’ (1955) విడుదలై రస హృదయులను మెప్పించింది.
మూల నాటకానికి యేమాత్రం భంగం కలుగకుండా యథాతథంగా తెర రూపమిచ్చిన తెలుగుతెర ఆణిముత్యం యిది. అయితే చివర్లో గిరీశంతో బుచ్చమ్మ వివాహం జరిపించడంపై విమర్శలు వెలువడటం గమనార్హం. డియల్ నిర్మించిన స్ర్తిసాహసం, శాంతి, దేవదాసు చిత్రాలకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించగా రుూ నాలుగో చిత్రానికి మాత్రం పి పుల్లయ్య దర్శకత్వం వహించటం విశేషం. గిరీశం పాత్రకుండే బలహీనతలు, వ్యంగ్యధోరణిని పూర్తిగా ఆకళింపజేసుకున్న యన్‌టి రామారావు హుషారుగా నటించి ప్రేక్షకుల మన్నన అందుకున్నారు. మధురవాణిగా సావిత్రి అభినయంతో విమర్శకుల నోళ్లు మూయించింది. ‘లొట్టిపిట్ట’ సీన్లో మధురవాణి రామప్పంతుల్ని ఆటపట్టిస్తూ రెండుమూడు నిమిషాలు అలా నవ్వుతూనే వుంటుంది. ఈ దృశ్యం సావిత్రి నటనకు పరాకాష్ట. ఏ పాత్రలోనైనా సావిత్రి యెంత అద్భుతంగా ఒదిగిపోతుందో ‘కన్యాశుల్కం’ ఒక నిదర్శనం. బుచ్చమ్మగా షావుకారు జానకి, అగ్నిహోత్రావధాన్లుగా విన్నకోట రామన్న పంతులు, లుబ్ధావధాన్లుగా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, కరటకశాస్ర్తీగా వంగర, రామప్పంతులుగా సి.యస్.ఆర్, సౌజన్యరావుగా గుమ్మడి, పోలిశెట్టిగా చదలవాడ, పూట కూళ్ళమ్మగా ఛాయాదేవి, గిరీశం శిష్యుడు వెంకటేశంగా మాస్టర్ కుందు, పోలీస్‌గా పేకేటి.. ఆయా పాత్రలకు జీవరేఖలు దిద్దారు. సదాశివబ్రహ్మం రచన చేయగా, మల్లాది రామకృష్ణశాస్ర్తీ, దేవులపల్లి, సముద్రాల, సదాశివబ్రహ్మం పాటలు వ్రాశారు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’లోని ఆనందం ఆర్ణవమైతే గేయాన్ని, బసవరాజు అప్పారావు నాగులచవితి గీతాన్ని రుూ చిత్రంలో వాడుకున్నారు. ‘ఆనందం అర్ణవమైతే’అంటూ మోజువాణి నృత్యాన్ని సావిత్రి అపూర్వం అనిపించే విధంగా చేసింది. సమయానుకూలంగా అతి చమత్కారంగా సమర్ధించుకోగలిగిన మేధాసంపత్తి కలిగిన గిరీశం భావాల్ని ప్రతిబింబించిన మల్లాది రామకృష్ణశాస్ర్తీ వ్రాసిన పాట ‘చిటారుకొమ్మన మిఠాయిపొట్లం’ ఘంటసాల అద్భుతంగా పాడి పాత్ర స్వభావాన్ని ప్రతిబింబింపజేశారు. గురజాడ కావ్యాలన్నింటిలో మేటి అయిన ‘పూర్ణమ్మకథ’ను వాడుకోవడం రుూ చిత్రంలో మరో విశేషం. స్మశానంలో ఒక కాలుపెట్టిన ముసలివాడు కూడ డబ్బుపెట్టి బంగారం వంటి పిల్లలను కొనుక్కొని తన వణికిపోయే చేతుల్తో తాళి కట్టవచ్చనే సాంఘిక దురాచారాన్ని దర్శకులు పి.పుల్లయ్య అనితరసాధ్యంగా చిత్రీకరించారు.

-పూజారి నారాయణ, అనంతపురం