Others

వెనె్నలలోనే వేడియేలనో(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలో -వెనె్నలలోనే వేడియేలనో అంటూ కొత్త దంపతుల విరహాగ్నిని వివరిస్తూ పింగళి కళం ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. పింగళి రచనను అభేరి రాగంలో ఘంటసాల రమణీయంగా స్వరాలద్దారు. లీలతో కలిసి ఆలిపిస్తే, తెరమీద నాగేశ్వరరావు, జమునల తొలి కాపురపు ముచ్చట్లను దర్శకుడు కెవి రెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు. కవి హృదయం కమనీయంగా వివరించే గీతమిది.
వెనె్నలలోనే వేడియేలనో/ వేడిమిలోనే చల్లనేలనో/ ఈ మాయ ఏమో జాబిలి’ అంటూ సాగే పంక్తులు వింటే.. వెనె్నల వేడిగా ఉండటమేమిటి? వేడిమిలో చల్లదనం ఏమిటి? విరహములోనే హాయి ఏమిటి?.. వీటిని ఆలోచిస్తే రచయిత భావుకతకు అద్దంపడుతుంది. వాస్తవంలో ఇవి నిజం కాకపోవచ్చు, కానీ.. కొత్త దంపతుల ముచ్చట్లు ఇలాగే ఉంటాయన్న కవి హృదయం శ్రోతలకు అర్థమవుతుంది. అలాగే మొన్నటికన్నా నిన్న వింతగా/ నిన్నటికన్నా నేడు వింతగా- ఇంకా రూపముకన్నా చూపు చల్లగా, చూపులకన్నా చెలిమి కొల్లగా- అంటూ రోజురోజుకు దంపతుల సాంగత్యం, మధురిమలు వింతగా ఎప్పటికీ నూతనంగా వికసించాలని భావిస్తూ అనుభవంలోకి తెస్తూవుంటే.. దంపతుల మధ్య అనురాగం పెరుగుతూ అలసత్వానికి అసలు తావివ్వదు కదా.
ఎంతోకొంత జీవితానుభవం ఉంటే తప్ప ఇంత ఉన్నతంగా కవి రాయలేడు అనిపిస్తుంటుంది. విచిత్రమేమంటే ఇలాంటి ప్రణయ గీతాలు అనేక సినిమాల్లో రాసిన రచయిత పింగళి ఆజన్మ బ్రహ్మచారి. 1958లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. అద్భుతంగా ఆలపించిన ఘంటసాల, లీలలాగే అంతే అద్భుతంగా ఏయన్నార్, జమునలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఒంట్లో బాగుండలేదని ఆఫీసుకు సెలవుపెట్టి ఇంటికి వెళ్లి భార్యతో సరసాలు ఆడుతుంటే, ఆఫీసు యజమాని డాక్టరును తీసుకెళ్లి పరిస్థితిని గ్రహించి మరికొన్ని రోజులు సెలవివ్వడం కూడా సరదాగా ఉంటుంది. ఈ పాటను ఇష్టపడని వాళ్లుండరని నా నమ్మకం. ఈ పాట వింటున్నపుడో, చూస్తున్నపుడో మనసుకు హాయి కలగటం ఖాయం.

-ఎన్ రామలక్ష్మి, సికిందరాబాదు