AADIVAVRAM - Others

ఓ శీతల ఉదయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరీడు.. మంచుదేవత
మధ్య సాగే యుద్ధం
ఇంకా ఓ కొలిక్కి రాలేదేమో?
తూర్పున విచ్చుకోవాల్సిన కాంతిరేఖ
కాసె్తైనా కనిపించడం లేదు
కోడి కూసి మూడు ఘడియలైనా..
ఆకైనా కదల్చకుండా
అలాగే నిలబడి
మత్తులో జోగుతున్నాయ్ కొబ్బరి చెట్లు..
ఆకురాలిన దేహాలు కొన్ని..
తమ నగ్నత్వాన్ని దాచుకోవడమెలాగో
తెలీక మధనపడుతున్నాయనేమో?
దట్టమైన మంచు తెరలు కప్పి
వాటి మానాన్ని కాపాడుతోంది ప్రకృతి
అప్పుడప్పుడే నడత నేరుస్తున్న
పసిదానిలా నెమ్మదిగా పాకుతుంది గోదావరి
గాలిలో చలనం లేదు
పక్షిమూకల పాటలు లేవు
అడుగుల శబ్దం తప్ప
చుట్టుపక్కల ఏ కదలికా లేదు
మూగపోయిన గొంతులు..
మత్తిల్లిన పరిసరాల్తో
బాటంతా దిగాలుగా సాగుతోంది..
సరిగ్గా అప్పుడే..
ఆ శీతల నిశ్శబ్దాన్ని చీలుస్తూ..
నల్గురు ముసుగు మనుషుల
మధ్యలోంచి
భగ్గుమంటూ...
పైకి లేచింది చలిమంట..
ఉదయపు నడకనాపి
చేతులు చాచి..
సాటి మనుషుల సవ్వడితో
స్వరం కలిపాను
నేను.
*

-గొడవర్తి శ్రీనివాస్ 8919231510