AADIVAVRAM - Others

విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిశ’ మానం చెరిచి
ప్రాణం తీసిన మృగాళ్ల
పిట్టల్లా కాల్చి పారేశాం

ఇంకేం..
వాడవాడలా ఆనంద వీచికలుల
ఊరూరా ఉత్సవ సందళ్లు
దేశం నిండా ప్రశంసల జల్లు
మొత్తంగా విజయ గీతాలాపనలు

ఇంతటితో
ఉన్మాదుల వికృత చేష్టలు ఉడిగేనా?
అతివ రెక్కలు విచ్చుకు
స్వేచ్ఛగా ఎగిరేనా?

ఎన్‌కౌంటర్ చేస్తేనో..
జైళ్లలో ఖైదీగా బంధిస్తేనో..
ఉరికొయ్యకు వేలాడేస్తేనో..
సమస్య పరిష్కారమైతే
లెక్కకు మించి దారుణాల
పునరావృతమేలా?
కన్నవాళ్ల కన్నీటి సంద్రం
ఉప్పొంగుట ఎలా?

వేళ్లకు సోకిన ‘తెగుళ్లు’ తొలిస్తేనే...
పంట చేలు పచ్చగా చిగురించేది
మనసున అంకురించు ‘విష’ బీజాల
వినాశనం చేస్తేనే ‘మనిషితనం’ పండేది

ప్రాణాల తోడెయ్యటం కాదు
పాప చింతనల అంతం చేయాలి
నివారణ కాదు ‘నిరోధం’ అనివార్యం

ఇప్పుడు చేయాల్సిందల్లా
మనిషిని ‘మృగం’ చేయు
మద్యం ధారకు అడ్డుకట్ట వేయాలి

అశ్లీలతను కుమ్మరించు అంతర్జాల
మహమ్మారి ‘కోరలు’ తెంచాలి
పాశ్చాత్య పోకడల ‘ఊడలు’ పెరకాలి
సామాజిక అంతరాల ‘వంతెన’ కూల్చాలి
నైతిక, మానవ విలువల బోధన
ఇంటి నుండే మొదలవ్వాలి

మహిళా సంరక్షణ ధ్యేయంగా
ప్రతి అడుగు ముందుకు సాగాలి.

అప్పుడే
‘స్ర్తి’ జాతికి విముక్తి.

-కోడిగూటి తిరుపతి.. 9573929493