AADIVAVRAM - Others

అవినీతి నిరోధక చట్టం 1988కు సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడెమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
**
ప్రభుత్వ అత్యున్నత కార్యాలయాల్లోని వ్యక్తులు న్యాయాన్ని అడ్డుకోవడానికి రాజ్యాంగాన్ని మళ్లించడానికి మరియు చట్ట నియమాలను అడ్డుకోవడానికిదేశానికి అపారమైన నష్టాన్ని కలిగించగలిగే గరిష్ఠ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ చట్టం అవినీతి పరులను రక్షించడానికి ఉపయోగించబడుతోంది. సామాన్యులను కాదు. చాలామంది న్యాయ విద్వాంసులు ఈ పరిమితిని తొలగించాలని సిఫారసులు చేశారు.
అవినీతిగా గుర్తించవలసిన కొత్తనేరాలు
కింది వాటిని అవినీతి నిరోధక చట్టం కింద నేరంగా వర్గీకరించాలి.
న్యాయం యొక్క ఆటంకం
ప్రాసిక్యూట్ చేయడానికి మంత్రులకు ముందుస్తు అనుమతిని నిరాకరించటం మంత్రులను విచారించటానికి ముందస్తు అనుమతి నిరాకరించడానికి సుప్రీంకోర్టు అనుమతి అవసరం. అపెక్స్ కోర్టు అటువంటి ఆమోదాలను మంజూరు చేస్తుంది మరియు దాని సిఫారుస్సులను రాష్టప్రతికి తెలియజేస్తుంది.అభ్యర్థనలు లేదా సిఫార్సులను స్వీకరించిన 3 నెలలో అపెక్స్ కోర్టు మరియు ప్రెసిడెంటు యొక్క చర్యలు పూర్తవుతాయి.
ప్రస్తావనలు
ప్రోచ్ ప్రాక్టికల్ మునిసిపల్ అపరాధ భావంతో వ్యవహరించడానికి రాబర్ట్ క్లిట్ గార్డ్ రోనాల్డ్ మాక్లీన్ అబరోవా హెచ్. లిండ్సే పారిస్
న్యాయ సంస్థాపకులు దుష్ప్రవర్తన ఆర్టికల్ 124
కొంతమంది న్యాయమూర్తులు మొత్తం కోర్టు వ్యవస్థ యొక్క పరువుకు ఆనవాలమైన ప్రతిమకు మరియు ప్రతిష్టను దెమ్బతీయడం దురదృష్టకరం. బాధితుడు న్యాయం కోరుతూ కోర్టుకు అప్పీల్ చేసినపుడు వారిని రక్షించడానికి న్యాయం మరియు సత్యం గెలుస్తుంది అనే గుడ్డినమ్మకంతోవారు వెళ్తారు.
న్యాయమూర్తులు అవినీతి ఆరోపణలపై అభియోగాలు మోపబడ్డారని వారు విన్నపుడు మంచి వ్యక్తుల హృదయాలు మరియు ఆత్మలు వ్యవస్థపై విశ్వాసం కోల్పోయేంత లోతులో మునిగిపోతాయి. మరియు తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని చూడటంలో వారు ఇంక విఫలమవుతారు. ఎందుకంటే ఇది చివరకి నిలబడలేదు.
న్యాయం ధనవంతులు మరియు శక్తివంతులు కొనుగోలు చేయగలిగిన వస్తువైపోతుంది. ఇది చట్టాన్ని అనుసరించి మంచి పౌరుడిగా ఉండాలనే ప్రతి ఒక్కరి ఆకాంక్ష ని దూరం చేస్తుంది. అటువంటి న్యాయమూర్తులు అవినీతిని సరిదిద్దడానికి సహాయం చేయకపోగా దేశాన్ని భ్రష్టు పట్టిసాతరు. బాధితుల కుటుంబాలు ఇప్పడికే నేరంతో నాశనమయినాయి. న్యాయం కొనుగోలు చేయవచ్చు ననే ఆలోచన వారిలో కలిగినపుడు నేరస్తుల్లా లేదా అవినీతి పరులైన న్యాయ మూర్తులా అధిక క్రూరులు అని వారు ఆశ్చర్యపోతారు. అదేవిధంగా ఓకే కమీటీ లేదా కమీషన్ లోని న్యాయమూర్తుల అభిప్రాయాలు జాతీయ భద్రత మరియు శ్రేయస్సుకు చాలా ముఖ్యమైనవి. డబ్బు వారి ప్రాధమిక లక్ష్యం అయితే న్యాయమూర్తి పదవి అవసరంలేదు. ఇంకా చాలా లాభదాయకమైన వృత్తులు ఉన్నాయి. పరిష్కార చర్యలు కోరుతూ ఒక వ్యక్తికైనా లేదా దేశానికైనా కోర్టులు రహదారిపై వేయగలిగిన చిట్టచివరి అడుగు కనుక అది ప్రతి ఒక్కరికీ ప్రధానమవుతుంది. అవినీతిని ఆపగలిగిన నిరోధం తగినదై ఉండాలి. అవినీతిని పాల్పడిన న్యాయమూర్తులకు అధిక ద్రవ్య జరిమానా అవసరం.
1988 అవినీతి నిరోధక చట్టానికి సవరణ
అవినీతి ఆరోపణలు లేదా న్యాయానికి ఆటంకం కలిగించిన న్యాయమూర్తులు వారి పెన్షన్లు కోల్పోతారు. అదనపు జరిమానాలు విధించాలని కోర్టులు నిర్ణయించవచ్చు.
దుష్ప్రవర్తన
సుప్రీంకోర్టుకు చేరుకున్న కేసులు దేశానికి ఎంతో ప్రాముఖ్యత మరియు ప్రజానీకానికి ఉపయోగం కలిగించేవిగా ఉంటాయి. న్యాయస్థానం యొక్క తీర్పులు లేదా చర్యలు చాలా కాలం తీసుకొన్న సందర్భాలు ఉన్నాయి. దానితో ప్రజలు కోర్టు వ్యవస్థపై ఆశ మరియు విశ్వాసాన్ని కోల్పోతారు. అటువంటి ఆలస్యం యొక్క నిజమైన కారణాలు తెలియకపోయినా అమోదయోగ్యమైన కారణాలతో వ్యవహరించడం అవసరం. ఎందుకంటే జస్టీస్ దానిని కోరుతుంది.
జస్టీస్ లేదా ధర్మ ప్రయోజనాల దృష్ట్యా న్యాయస్థానం తన తీర్పును సహేతుకమైన మరియు సమయానుసారంగా అందించాల్సినదిగా రాజ్యాంగ సవరం బహుశా అవసరం. ఎందుకంటే ఎక్కువ ఆలస్యం అటువంటి జాప్యాలకు కారణాలను తప్పుగా అర్థం చేసుకోవడానికి దారి తీస్తుంది. తీర్పులలో సుదీర్ఘ జాప్యానికి మంచి కారణాలు అనేవి ఉండవు. అక్రమంగా సంపాదించిన డబ్బును కలిగి ఉన్న విదేశీ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల జాబితాను బహిరంగం చేయడంలో ఆలస్యానికి అర్థవంతమైన వివరణ ఉందా? దేశానికి న్యాయస్థానం సక్రమమైన సేవ చేసిందా?
తమ తీర్పును ఇవ్వడానికి ఒక నిర్దిష్ట తేదికి కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్న మరియు సమర్థులైన న్యాయమూర్తులు మాత్రమే ఏదైనా కేసును వినడానికి అనుమతించబడాలి. కేసు లేదా పిటిషన్ను అంగీకరించిన తరువాత సుప్రీం కోర్టు తీసుకోవలసిన మొదటి చర్య అది. దేశ పౌరుల ప్రయోజనాల దృష్ట్యా అత్యున్నత నీతి ప్రమాణాలను నిర్దేశించే స్ఫూర్తితో మిగతా వారందరికీ మార్గదర్శకులై మరియు స్వలాభం ధర్మ విచక్షణ ల మధ్య సంఘర్షణకు స్వల్పంగా కూడా అవకాశం రాకుండా ఉండడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ తరువాత 8 ఏళ్లు ప్రభుత్వంచే ఉద్యోగాలు మరియు పదవులు అంగీకరించకూడదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పదవులను అంగీకరించకూడదు.
ఈ కార్యాలయాన్ని ఆక్రమించే వ్యక్తుల యొక్క ఏదైనా అనైతిక లేదా నేరపూరిత ప్రవర్తన ధర్మమార్గంలో నడిచే వారి ధైర్యాన్ని చిన్న పెద్దలను ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది. అనేది కాదలేని వాస్తవం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న దుష్ప్రవర్తన మరియు అవినీతి ఆరోపణలపై చాలా నివేదికలు వచ్చాయి. సుప్రీంకోర్టు తీసుకొన్న చర్యలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి తెస్తాయా? ఇది అత్యున్నత న్యాయస్థానం యొక్క కళంకమైన చిత్రాన్ని శుభ్రం చేయగలదా?
భారతదేశం ఒక బిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన దేశం. అత్యున్నత స్థానంలో కూర్చున్న వ్యక్తి మరే ఇతర సాధారణ వ్యక్తిలాగే ఉంటారని న్యాయ ప్రవర్తనపై రాజీ పడటానికి సిద్ధంగా ఉంటారని తెలుసుకోవడం దిగ్బ్రమ కలిగిస్తుంది.
తరగతి గదిలో ఉపాధ్యాయునిగా అర్హత సాధించడానికి తరగతిలని విద్యార్థుల కంటే ఉపాధ్యాయుడు కొంచెం ఎక్కువ తెలిసిన వాడు కావాలి. అదేవిధంగా న్యాయమూర్తిగా అర్హత సాధించాలంటే కోర్టు గదిలో నేరారోపణలతో నిలబడే అవినీతిరాజకీయ నాయకుల కంటేనైతిక ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి.
ఆర్టికల్ 124 ను ఈ క్రిందివిధంగా సవరించాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు స్థాపన మరియు ...
8. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మరియు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెంటనే ప్రభుత్వం నుండి చెల్లింపు లేదా గౌరవ పదవులను వరుసగా ఐదేళ్లు మరియు ఎనిమిది సంవత్సరాల వరకు అంగీకరించడం నిషేధించబడింది.
9. ఒక కేసును వినడానికి అంగీకరించడం పై సుప్రీం కోర్టు తీసుకోవలసిన మొదటి మరియు ప్రధాన చర్య ఏమిటంటే తీర్పు ఇవ్వడానికి సకాలంలో మరియు సహేతుకమైన తేదీని ప్రకటించడం. తేదీని తరిలించడానికి ఈ కేసుతో సంబంధం లేని ఐదుగురు సీనియర్ మోస్ట్ జడ్జీల మద్ధతు అవసరం.
మానవజీవిత కాలంతో సహా ప్రతిదానికి పరిమితులు ఉన్నాయి. ఆలస్యం అయిన న్యాయం తిరస్కరించబడిన న్యాయంతో సమానం.
పైన పేర్కొన్న చట్టాలు సుప్రీంకోర్టుకు సరైన మార్గంలో మార్గనిర్దేశం చేస్తాయి. దేశ ప్రజలకై తమ ప్రాధమిక ప్రవృత్తి ధర్మానికి తమను తాము అంకితం చేసుకొంటాడు. ఈ చట్టాలతో న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం చెక్కు చెదరకుండా ఉంది.
ప్రస్తావనలు .. సుప్రీంకోర్టు సమగ్రతపై భారత అత్యున్నత న్యాయమూర్తుల అపూర్వమైన హెచ్చరిక జారీ చేశారు. (27 జనవరి 2018)

- ఆనంద్ గరికపాటి