Others

ప్రియతమా..(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే/ కమ్మనీ ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే/ ఊహలన్ని పాటలే/ కనుల తోటలో/ తొలి కలల కవితలే మాట మాటలో.. / ఓహో -కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే/ ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే...
1991లో తమిళ, తెలుగు భాషల్లో అమావాస్య (దీపావళి)న వచ్చిన పున్నమి చిత్రం -గుణ. ఇదొక సైకలాజికల్ రొమాన్స్ థ్రిల్లర్. శాబ్ జాన్ రాసిన కథని దర్శకుడు సంతాన భారతి అద్భుతంగా సెల్యులాయిడ్‌కి ఎక్కించాడు. కమల్‌హాసన్, రోషిణి లీడ్ రోల్స్ చేశారు. మనుషులకు అర్థమయ్యే మామూలు ప్రేమకు అతీతమైన అజరామర ప్రేమను చూపించే సన్నివేశం కోసం రచయిత రాసిన అద్భుత పద లాలి’త్యమే ఈ పాట. దేవలోకం నుంచి తనకోసం అభిరామి (దేవత) దిగివస్తుందని, పున్నమిరోజున ఆమెను పెళ్లి చేసుకోవడమే తన గమ్యమన్న ఓ సైకిక్ పేషెంట్ భావన నుంచి సాగే ప్రేమకావ్యమిది.
చదువురాని కథానాయకుడు గుణ -తను ప్రేమిస్తున్న అమ్మాయిని ఓ లేఖ రాయమంటాడు. అది ఆమె కోసం రాసే ప్రేమ లేఖ. అది విన్న ఆమె ఆశ్చర్యపోతుంది. అంటే కథానాయకుడి మనసు భావాన్ని అక్షరాలుగా మలచి అతనికే వినిపిస్తూ -కథానాయిక తనకు తానుగా రాసుకునే ప్రేమ లేఖే ఈ పాటన్న మాట. ‘గుండెల్లో గాయమేదో చల్లంగ మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే’ అంటాడు చరణం మొదటి లైన్‌లో రచయిత. మనసు గాయాన్ని మాయం చేసేది ప్రేమేనని ఓదార్పుగా చెబుతూనే.. వెంటనే, ‘ఎంత గాయమైనగాని నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందెనే’ అన్న భావన వ్యక్తం చేస్తాడు. మానసిక, శారీరక స్థితిని ప్రేమ ఎలా మారుస్తుందో చెబుతూనే.. ‘వెలికిరాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నదీ/ నాదు శోకమోపలేక నీ గుండె బాధ తాళనన్నది’ అన్న వేదన వ్యక్తం చేయడం అద్భుతం. ‘మనుషలెరుగలేరు.. మనది మామూలు ప్రేమ కాదు. అగ్నికంటే స్వచ్ఛమైనది’ అన్న భావన భావోద్వేగానికి పరాకాష్ట. ప్రేమ లేఖ రాసి హాయైన భావనతో అలసిపోయిన ప్రియురాలిని జోకొడుతూ -‘మమకారమె నీలాలి పాటగా రాసేది హృదయమా’ అంటూ ముగిస్తాడు. గుండెల్లోని ప్రేమను లాలిపాడినంత అద్భుతంగా వ్యక్తం చేయడమే పాటలోని ప్రత్యేకత. ప్రేమకోణంలో రచయిత అందించిన సున్నితత్వానికి అంతే లలితంగా బాణీకట్టి ఇళయరాజా పాటను చిరస్థాయి చేసేశారు. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఇది. ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం.
-కెబి లలిత్‌వర్మ, సికింద్రాబాద్