AADIVAVRAM - Others

ప్రేమపూర్వకమైన మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమతి బాగా పాటలు పాడుతుంది. చాలా కచేరీలు ఇచ్చేది. కానీ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. పాటలు పాడటం ఆపేసింది. ఓ సంవత్సరం పాటు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె జీవితంలో గొప్ప గాయని కావాలని అనుకొంది. అనారోగ్యం వల్ల సాధన పూర్తిగా పోయి తాను పాట పాడలేనన్న స్థితికి వచ్చేసింది. జీవితం మీద నిరుత్సాహం వచ్చేసింది. బతకాలన్న కోరిక కూడా తగ్గిపోయింది. అనారోగ్యంతో చనిపోతే బాగుండునని చాలాసార్లు అనుకొంది. ఎందుకూ పనికిరానని అనుకొంది. ఆమె భర్త సాగర్ ఈ పరిస్థితిని గమనించాడు. ఆమెలో ఆత్మవిశ్వాసం రోజురోజుకీ సడలిపోతోందన్న విషయం గ్రహించాడు. అతను సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ విషయమే సుమతికి చెప్పాడు. ఆమెకు ఆశ్చర్యం వేసింది.
రోజూ తాను నేర్చుకున్న సంగీత పాఠాలు ఆమెకు చెప్పేవాడు. కొద్ది రోజుల తరువాత పాటలోని మెలకువలు చెప్పమని సుమతిని తరచూ అడిగేవాడు. నువ్వు పాడి చూపించగలవు అని ప్రేమపూర్వకంగా చెప్పేవాడు. మెల్లమెల్లగా అతనికి చెబుతూ సుమతి పాట పాడటాన్ని మొదలుపెట్టింది. ఆరు మాసాల తర్వాత ఆమెలో ఆత్మవిశ్వాసం బలపడసాగింది. సాగర్ ఈ విషయాన్ని గమనించి, రోజూ తన సాధన పరుతో ఆమెను సాధనలోకి దించేవాడు.
అలా మూడు నెలలు గడిచాయి.
‘నీ లక్ష్యం గుర్తుందా?’ అడిగాడు సుమతిని.
సుమతి తలూపింది.
‘ఇక కచేరీలకి వెళ్దాం. నువ్వు ముందటికన్నా బాగా పాడగలవు’ అన్నాడు ఒకరోజు సాగర్.
ఆయన ప్రోత్సాహపు మాటలతో ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు చెక్కిళ్ల మీదకు ప్రవహించాయి.
కానీ ఆమె ముందు ఒప్పుకోలేదు. రెండు నెలలపాటు సాగర్ ఆమెను అడుగుతూనే వచ్చాడు. కొద్దిరోజులకి ఆమెకు తన మీద తనకు విశ్వాసం ఏర్పడింది.
అతను ఆమెను ప్రేరేపించలేదు. ప్రభావితం చేశాడు.
‘నీ ప్రేమపూర్వకమైన మాటలతో నేను ప్రభావితం చెందాను సాగర్’ అంది మొదటి కచేరీ నుంచి వస్తూ. అప్పటి నుంచి కచేరీలకు వెళ్లడం మొదలుపెట్టింది.
ప్రేమపూర్వకంగా మాట్లాడితే ఎవరైనా ప్రభావితం చెందుతారు.
మనతో మనం కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి.
ప్రేమపూర్వకమైన మాటలు విశ్వమంతా పరివ్యాప్తం కావాలి.