Others

కొత్త ఏడాదిని ఎలా మలచుకోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య కాలంలో యువత మద్యాన్ని సేవించి డ్రైవింగ్‌కు ఉపక్రమించడం మూలాన ఎంతగా పలు ఘోర, ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నారో, తీవ్రగాయాల పాలు అయ్యేవారి తల్లిదండ్రులకు ఎంతటి గర్భశోకాన్ని మిగులుస్తున్నారో తెలియనవి కాదు. ముఖ్యంగా నూతన సంవత్సరం వచ్చిన సందర్భంలో యువతీ యువకులు మరింతగా మద్యం సేవించి పేట్రేగి పోతూ, వాహనాలకు విపరీతమైన వేగంతో నడుపుతూ వారొక హీరోలుగా, హీరోయిన్లుగా ఫీలవుతున్నారు. కానీ ఒక్కోసారి యువతీ యువకులు అదుపుతప్పి వేగం కారణంగా తమ ప్రాణాల మీదకు సైతం కొని తెచ్చుకుంటూ ఉంటారు. వీరిని నియంత్రణ చేయడం వారి తల్లిదండ్రులకు సైతం శక్తికి మించిన పనిగా పరిణమిస్తూ ఉంటుంది. యువత నూతన సంవత్సరం రోజైనా జ్ఞానోదయం పొంది తమ వైఖరిలో మార్పు తెచ్చుకోకుండా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే జీవితం ఎంతో విలువైనది. క్షణికావేశంలో చేసే తప్పుల వల్ల తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టక జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిగా ముందుకు నడవాలి.
ఈ సంవత్సరం నుంచైనా ఒక మంచి మార్పునకు స్వీకారం చుడితే రాబోయే కాలంలో మన దేశం అంతర్జాతీయ సమాజంలో ఒక వెలుగు వెలగడం తథ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యువత ఒక్కసారి ఉక్కు పిడికిలి బిగించి పరిశ్రమించింది అంటే మన దేశ పురోభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదు.

- బుగ్గన మధుసూదన రెడ్డి