AADIVAVRAM - Others

శాస్ర్తియ ఆవిష్కరణలు --- ఎలక్ట్రిక్ సెల్ బ్యాటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటలీ దేశపు ప్రొఫెసర్ లూగీ గల్వానీ పరిశోధనలను గూర్చి చదివిన ఆ దేశపు భౌతిక శాస్తవ్రేత్త ఆలెసాండ్రో వోల్టా ఎంతో ఉత్తేజితుడయ్యాడు. ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ చేసిన ఫలకాన్ని కప్ప నాడులను స్పర్శించగానే దాని కండరాలు సంకోచిస్తాయని గల్వానీ గుర్తించాడు. దీనిని ఆధారం చేసుకుని ఆయన కప్ప శరీరంలో కొంత మొత్తంలో విద్యుత్ ఉంటుందని సిద్ధాంతీకరించాడు. గల్వానీ ప్రకటించింది అసత్యమని నిరూపించేందుకు వోల్టా పూనుకున్నాడు. లోహం, నీరుల కలయిక వల్ల విద్యుదావేశం జనిస్తుందని ఆయన భావించాడు. తమ ప్రతిపాదనను పరిశీలించేందుకుగాను వోల్టా 1800లో ఇప్పుడు వోల్టాయిక్ ఫైల్ అనే దానిని రూపొందించాడు. ఈ ఫైల్‌లో జింక్, రాగి లోహాలతో తయారుచేసిన రెండు ఫైల్స్ ఒక దానిపై ఒకటి పేర్చి ఉంటాయి. ఈ ఫైల్స్ విద్యుత్ ఆవేశాన్ని జనింపజేస్తాయి. ఈ రెండు ఫైల్స్‌ను వైర్లతో కలిపినప్పుడు వాటిలో విద్యుత్ కొంత సమయం వరకూ నిల్వ ఉండింది. ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ సెల్ బ్యాటరీ.

-నాయక్