Others

జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవి పాతవే అయినా గొప్పవి. వీటితో ఈ సంవత్సరం తాలూకు జ్ఞాపకాలను పదిల పర్చుకోవచ్చు. అప్పుడప్పుడూ గతాన్ని తిరగేసి ఆనందాన్నీ పొందవచ్చు. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ పాత సంప్రదాయాలకు మళ్లీ కొత్తగా తెరతీయండి..
డైరీలు: న్యూ ఇయర్ అనగానే డైరీలకు బాగా డిమాండ్. తమ జ్ఞాపకాలను పదిల పరచుకునేందుకు ఇవి చక్కటి సాధనాలు. స్నేహితులకు ప్రెజెంట్ చేయడానికి డైరీ కూడా మంచి కానుక. పాకెట్ డైరీల నుంచి పెద్ద డైరీల వరకు వివిధ డిజైన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్న డైరీలు చూడండి. వాటిని చూడగానే ఈ సంవత్సరం నుంచైనా డైరీ రాయాలన్న బుద్ధి పుడుతుంది. మరి అలాంటి డైరీలను ఆత్మీయులకు కానుకలుగా ఇచ్చి తమ జ్ఞాపకాలను పదిల పర్చుకునేలా చేయండి.
గ్రీటింగ్ కార్డ్స్: శుభాకాంక్షలు చెప్పడానికి రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ మార్కెట్లో ఉండనే ఉంటాయి. స్నేహితుల అభిరుచిని అనుసరించి దానికి మీ అభిరుచిని కూడా జతచేసి పంపే గ్రీటింగ్స్ ఒక ఆత్మీయమైన కరచాలనం వంటిది.
బహుమతులు: ఎదుటివాళ్ళతో మన అనుబంధాన్ని పదేపదే జ్ఞప్తికి తెచ్చేలా చేయడంలో బహుమతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కలర్‌ఫుల్ గ్రీటింగ్స్‌తో పాటు మీరు కోరిన విధంగా కానుకలను అందించే షాప్స్ నగరంలో ఉన్నాయి. ఒక్క కానుక ఇస్తే అది చెరగిపోని జ్ఞాపకమై వచ్చే ఏడాదంతా వారి హృదయంలో మీ చోటు పదిలం చేస్తాయి.