Others

పర్యావరణ పరిరక్షణతో ప్రగతికి సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికత, సాంకేతికత, పరిశోధన అన్నవి ఏ ఒక్క కాలానికో పరిమితమైనవి కావు. మనిషి ఆవిర్భావంతోనే ఇవి కూడా అనాదిగా తమ ఉనికిని చాటుకుంటూ సమాజానికి తమ వంతు మేలు చేకూరుస్తున్నాయి. మనిషికి బట్ట కట్టుకోవడం తెలియని రోజుల్లో- రాళ్ళ రాపిడితో నిప్పును పుట్టించడం, పచ్చి మాంసాన్ని కాల్చుకుని తినడం, వ్యవసాయాన్ని కనిపెట్టడం వంటివన్నీ పరిశోధనలే! అప్పటి కాలానికి అవి ఆధునికత కిందికే వస్తాయి. కాలక్రమంలో ఆ పరిశోధనల్లో మరిన్ని మార్పులు, చేర్పులకు అవకాశం కలగడంతో అభివృద్ధికి, సౌకర్యాలకు విస్తృతి పెరిగింది. అలనాడు మార్కొనీ రేడియోని కనుక్కున్నపుడు పెద్ద పెట్టెంత ఆకారంలో వుండి, విద్యుత్ వైర్ల కనెక్షన్‌తో ఉన్నా అది ఒక అద్భుత దూరశ్రవణ యంత్రంగా విశ్వవ్యాప్తంగా అందరి మన్ననలను అందుకుంది. ఆ తరువాత వైర్‌లెస్ ట్రాన్సిస్టర్లు అరచేతిలో ఇమిడే సైజువి వచ్చి జనాన్ని మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి. దూరశ్రవణమే కాదు ‘దూరదర్శనం’ కూడా సాధ్యమే అన్న ఒక పరిశోధకుని ఆలోచన టెలివిజన్‌ని కనిపెట్టేలా చేసి, సైన్స్‌కు అసాధ్యం అంటూ ఏదీలేదని నిరూపించింది. పరిశోధన అనేది నిరంతర ప్రవాహం లాంటిది. ఫలానా కాలంలో ప్రారంభమైందని చెప్పటానికి వీల్లేదు. ఆ మాటకొస్తే- సైన్స్, సైంటిస్ట్‌లు ఈ మోడ్రన్ యుగంలోనే కాదు, పురాణ, ఇతిహాస కాలంలోనూ ఉన్నారు. ఆర్యభట్టు, విరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, చరకుడు, పతంజలి వంటి ఎంతోమంది శాస్తజ్ఞ్రులు జ్యోతిష, గణిత, వైద్య శాస్త్రాలను రచించారు. అందుకే ఇపుడు ‘కొత్తది’ అని చెప్పుకుంటున్న ప్రతి అంశానికి మూలాలు మన ప్రాచీన కాలంలోనే ఉన్నాయని మనం చెప్పుకుంటాం. విదేశీ సైంటిస్ట్‌లైన రైట్ సోదరులు కొంత ఎత్తుకు మాత్రమే ఎగరగలిగిన విమానాన్ని కనుక్కున్నపుడు- అది ‘పుష్పక విమానం’ పేరుతో మా ప్రాచీనులు ఎప్పుడో కనుక్కున్నారని భారతీయులు అంటారు. ‘ఆధునికత’ అనేది ఇపుడే ప్రారంభమైంది కాదు, సైన్స్ ఈ కాలంలోనే కొత్తగా పుట్టలేదు.
ఏ కాలం వారైనా సమాజ ప్రగతిని, అభ్యుదయాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని ఆశించినవారూ, అందుకోసం కృషిచేసినవారే అయి ఉన్నారు. కొత్త వస్తువు, సరికొత్త పరిశోధన వచ్చినపుడు పాత వస్తువులు, పాత పద్ధతులు పక్కకు తప్పుకోక తప్పదు. ప్రవహించే లక్షణమున్న సమాజ సంస్కృతిలో ఈ పరిణామాలు అత్యంత సహజమైన ప్రక్రియ. మనిషి అవసరాలను బట్టి, సామాజిక ప్రయోజనాలను బట్టి ఎంత కావాలో అంత అన్నట్లు కాకుండా ఓ వేలం వెర్రిగా, ఓ వ్యామోహంలా పోటీ పడి వస్తు ఉత్పత్తి చేయడం అనర్థదాయకమే. ప్రపంచాన్ని యంత్రాలతో నింపేయడంతో మనిషి స్వయంశక్తి, మేథాసంపత్తి మరుగున పడిపోతున్నాయి. స్కూలు పిల్లలకు సైతం కాలిక్యులేటర్లు, లాప్‌ట్యాప్‌లు ఇవ్వడంతో చేతివేళ్ళకు తప్ప మెదడుకు వాళ్ళు పని కల్పించే అవసరమే లేకుండా పోతోంది. మనుషులు తమ జీవితాలను యంత్రాలకు అంకితం చెయ్యడంతో మానవ సంబంధాలకు ఓపిక, తీరిక లేకుండా పోతున్నాయి. యంత్రాల మధ్య మనిషి నిరంతరం పనిచేస్తూ, తాను ఏ స్పందనలు, ఆలోచనలు లేని యంత్రంలా మారిపోతున్నాడు. ముఖ్యంగా సాంకేతిక రంగంలో పోటీతత్వాల మధ్య చిక్కుకుని సున్నితత్వాన్ని, ప్రేమైక జీవితాన్ని నేటి యువత కోల్పోతున్నది. ఈ పరిణామాలు ‘్భవిష్యత్ భారతానికి చాలా ప్రమాదకరం’ అని ఇప్పటికే సంకేతాలను కూడా పంపిస్తోంది. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. అడ్డూ అదుపూ లేకుండా విశ్వమంతా నిండిపోతున్న వస్తు వ్యామోహం, కష్టపడకుండా అన్నీ తన వద్దకు రావాలన్న ఆలసత్వం, ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయిన యంత్ర వినియోగం.. ఇవన్నీ ఒక్క మన దేశానే్న కాదు, ప్రపంచం మొత్తాన్ని పెను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన కాలుష్య సమస్యకు కారణమవుతున్నాయి. ఇదే ఒక పెద్ద భూతంలా మారి విశ్వం మొత్తాన్ని వణికిస్తున్నది. పెట్రోలు, డీజిల్ వాడకం, ఫ్యాక్టరీల గొట్టాల నుంచి వెలువడే పొగ, వీటి మూలంగా వాయు కాలుష్యం జరిగి ఓజోన్ పొర ఛిద్రమైపోతోంది. భారీ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థరసాయనాలు, హాస్పిటల్ వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్, పాలిథిన్‌ల వాడకం మూలంగా భూగర్భం, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. బోరుబావుల పేరిట భూమిని రంధ్రాలతో ఛిద్రం చేయటం, పట్టణీకరణ మోజులో అడవుల్ని నరకడం, చెరువులను, కుంటలను, నదీ తీరాలను కబ్జా చేసి బహుళ అంతస్థులు నిర్మించుకుంటున్నారు. భూతాపం పెరిగి, మంచు పర్వతాలు కరిగి, సముద్రమట్టాలు పెరగడంతో చీటికీ మాటికీ వరదలు, భూకంపాలు, సునామీలు వచ్చి భారీగా ఆస్తి,ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఒకప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చాలా అరుదుగా జరిగేది. అవి మన చేతిలో లేనివని, ఏ దేవుడో లేక భూమాత కోపించి రప్పించిన ప్రళయం అనీ జనం నమ్మేవారు. కానీ, నేడు అక్షరజ్ఞానం లేనివాడికి కూడా తెలిసిపోతోంది. మనిషే ప్రకృతి వైపరీత్యాలకు కారణం అని! స్వయంకృతాపరాధంవల్ల తన కొంప ముంచుకోవటమేగాక భూలోకానే్న మటుమాయం చేయబోతున్నాడని! అభివృద్ధి పేరిట నేడు పర్యావరణానికి జరుగుతున్న హానితో ముందు ముందు ఉపద్రవాలు తప్పవని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. అలనాడు ద్వారకా పట్టణం సముద్రంలో మునిగిపోయినట్లుగా, కొద్ది రోజుల్లోనే దీవులన్నీ నీట మునిగిపోయి.. ఆ తర్వాత క్రమక్రమంగా పట్టణాలకు పట్టణాలే మునిగిపోతాయట. భూతాపం మరింత పెచ్చుపెరిగితే, మంచు పర్వతాలు కరిగి ఊళ్ళమీద పడితే, సముద్ర మట్టాలు పెరిగితే జరగబోయేది అదే! ఇపుడు కొన్ని జంతువులు, పక్షులు, వృక్షజాతులు కంటికి కనిపించకుండా మాయమైనట్టే భవిష్యత్‌లో మనుగడే ప్రశ్నార్థకం కాబోతుందేమో. అంతటి విపత్తు రాకుండా ఉండాలనే పర్యవరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాల అగ్రనేతలు తాజాగా పారిస్‌లో సమావేశమయ్యారు. ప్రగతిని సాధిస్తూనే పర్యావరణాన్న కాపాడుకునేలా, ఈ రెండు అంశాలూ సమాంతరంగా సాగిపోయేలా నిర్ణయాలు తీసుకోవడమే కాదు. వాటిని ఆచరణలో అమలు చేసినపుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. అపుడే శాస్త్ర విజ్ఞానానికి, ప్రగతి పథకాలకు సార్థకత చేకూరుతుంది.

-కొఠారి వాణీచలపతిరావు