Others

అంత వీజీకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు చూసే ప్రేక్షకులకు నటించేవాళ్ల బాధలు ఎప్పటికీ తెలియవు. అవి పాటలు కానీ, ఫైట్స్ కానీ. ఒక్కొక్క సన్నివేశాల్లో నటించడానికి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతాం. ముఖ్యంగా లిప్ టు లిప్ కిస్ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది అని చెబుతోంది పూజా హెగ్డే. తెలుగులో ప్రస్తుతం టాప్ లీడింగ్‌లో వున్న ఈ అమ్మడు, ముద్దు సీన్లు చేయడం అంత వీజీ కాదంటోంది. ఆ ముద్దుసీన్లు తెరపై చూసేవారికి కిక్కిస్తాయి. చాలా బాగుంటాయి కూడా. కానీ చేసేవారి కష్టం ఎవరికీ కనపడదు. మేము ఆయా సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడతాం. అవి రియల్‌గా ఉన్నాయని ప్రేక్షకులు నమ్మడానికి మేము పడే కష్టం అంతా ఇంతా కాదు అని చెబుతోంది. ఆమె గతంలో ఓసారి హృతిక్ రోషన్‌తో లిప్‌లాక్ సీన్‌లో నటించాల్సి వచ్చింది. మొదట డైరెక్టర్ వచ్చి సీన్ గురించి చెబితే ఓకె అనేసింది కానీ, కెమెరాముందుకు వెళ్లేసరికి సిగ్గుతో ఇబ్బంది పడిపోయిందట. దానికితోడు సెట్‌లో 30, 40 మంది ముందు అలా ముద్దు సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించిందట. గతంలో కూడా ఇటువంటి సన్నివేశాల్లో నటించకపోవడంతో ఇబ్బంది పడ్డానంటోంది ఈ భామ. తాజాగా ఆమె నటించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌తో కలిసి జాన్ చిత్రంలో కూడా నటిస్తోంది ఈ అమ్మడు.