Others

పోటీనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార అగ్ర కథానాయికగా కొనసాగుతూనే అనేకమందితో రొమాన్స్ చేసిందని గాసిప్స్ అప్పట్లో చాలా వచ్చేవి. ఏది ఎలా వున్నా, ఎప్పుడూ మీడియాలో వుంటూ ప్రేక్షకులకు తన స్టేటస్ ఏంటో తెలుపుతూనే వచ్చిందామె. తాజాగా అలాగే తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న రష్మిక మండన కూడా నిరంతరం వార్తల్లో వుంటోంది. గతంలో ఆమె ప్రేమించి పెళ్లిపీటలదాకా వెళ్లిన హీరో రక్షిత్ శెట్టి తాజా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’ విడుదలకు సిద్ధవౌతున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని కూడా మరోసారి మీడియాలో ఉండడానికే ఉపయోగించుకుంది. ఇద్దరికీ బెంగుళూరులో అప్పట్లో ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయింది. కానీ అనుకోకుండా రష్మిక మండన తెలుగు చిత్రాలలో బిజీగా మారింది. టాప్ హీరోయిన్ ఎదుగుతున్న నేపథ్యంలో ముందు జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఇందుకు కథానాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న రక్షిత్ శెట్టి కూడా ఓకె అనేశాడు. రష్మిక మండన తెలుగులో హిట్ అయిన నేపథ్యంలో తాను కూడా తెలుగు చిత్రసీమలో పాగావేయాలని రక్షిత్ శెట్టి బైలింగ్వువల్‌గా రూపొందించిన ‘అతడే శ్రీమన్నారాయణ’గా వస్తున్నాడు. దీనికి కూడా రష్మిక మండన ఆల్ ది బెస్ట్ చెప్పింది. మొత్తానికి కాబోయే జంట దూరంగా వున్నా ఒకరి చిత్రాలకు ఒకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం సరికొత్తగా అన్పిస్తుంది. చూద్దాం.. ఈ జంట ప్రస్థానం చివరికి ఎటు వెళ్తుందో?