Others

జయభేరి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.పుల్లయ్య దర్శకత్వంలో 1959లో వచ్చిన సంగీత భరిత చిత్రం జయభేరి. నాగేశ్వరరావు, అంజలి, గుమ్మడి, శాంతకుమారి, రేలంగి, రమణారెడ్డి ప్రధాన తారాగణం.
కాశీనాథ్ అనే యువకుడు అన్న, వదినెల చాటున పెరుగుతూ శాస్ర్తియ సంగీతం అభ్యసిస్తుంటాడు. గురువు రాగ ప్రస్తావన చెయ్యమంటే సాధన కాకుండా ‘‘మది శారదాదేవి’’ అనే ఉత్తేజకరమైన పాట పాడతాడు. ఘంటసాల వగైరా పాడిన ఈ పాట అద్భుతం. సవాల్ చేసిన దొమ్మరుల్లోని చిన్న దానిని ఓడించి, కొన్ని సన్నివేశాల తర్వాత ఆ చిన్నదానినే వివాహమాడుతాడు. దాంతో గురువు ఆగ్రహానికి గురవుతాడు. గ్రామంలోని బ్రాహ్మణ్యమూ, అన్నగారు, చివరకు గురువుకూడా ఆగ్రహించగా ఇంటినుంచి వెళ్లిపోతాడు.
సంగీతం పామరులకు చేరాలన్న కాంక్షతో భార్యతో సహా ఊరూరా తిరుగుతూ, జన రంజకమైన పాటలు పాడుతూ ఆ క్రమంలో సంగీతప్రియుడైన విజయనంద చక్రవర్తి కంట బడతాడు. చక్రవర్తి కోరికపై పండితులను మెప్పించడంకోసం ‘రసికరాజ తగువారము కామా’ అన్న పాట పాడి అందరి మెప్పు పొందుతాడు. పెండ్యాల స్వరపర్చగా గాయక చక్రవర్తి ఘంటసాల పాడిన ఈ పాట చిత్రానికి శిరోమాణికం. తర్వాత రాజ నర్తకి కుట్రవల్ల మద్యానికి దాసుడై చక్రవర్తి ఆగ్రహానికి గురవుతాడు. నైతికంగా పతనం అవుతున్నా, గాయకుడిగా తారాస్థాయిలో వుంటూ, ఇల్లూఒళ్ళూ గుల్లచేసుకొంటాడు. పతనం అవుతున్న మరిదికోసం వదిన భర్తను ధిక్కరించి వచ్చి, ఆక్రోశంతో మరిది చెంపను కొట్టి, ఆత్మహత్య చేసుకోబోతుంది. చివరకు కాశీ అన్నగారిలో పరివర్తన వస్తుంది. తను తల్లిలా భావించే వదిన ఆత్మహత్యా ప్రయత్నంవల్ల కాశీలోనూ పరివర్తన అయ్యి కథ సుఖాంతమవుతుంది. ఇందులోని మిగతా పాటలతోపాటు చిత్రంలో చోటుచేసుకోని ‘నీదాన నన్నదిరా’ (ఘంటసాల) అన్న మహత్తరమైన పాట కూడా వుంది.
రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, సురభి కమలాబాయిల ‘పారిజాత పుష్ప’ నాటకం కడుపుబ్బ నవ్విస్తుంది. ఇదే చిత్రంలో అగ్రకులాల, నిమ్నకులాల తేడాలు చెబుతూ పాడిన పాట -నందుని చరితము వినుమా.. పరమానందము గనుమా పారవశ్యం చేస్తుంది. అలాగే, నీదాన నన్నదిరా/ నినే్న నమ్మిన చిన్నదిరా/ తానే ఒక మధు కలశమని/ మనసే ఓ నందనమని.. అంటూ మత్తులోవున్న నాయకుడు పాడే పాట అత్యద్భుతంగా ఉంటుంది. తెలుగులో వచ్చిన ఇంత కట్టుదిట్టమైన సంగీత భరితచిత్రం నాకు నచ్చిన చిత్రం.
-గిరిజా రమణుడు, వక్కలంక