Others

ఒకటి ఒకటి ఒకటి (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1959వ సంవత్సరంలో నాయిక షావుకారు జానకిపై చిత్రీకరించబడి, పిల్లలకు పాఠంగా పనికివచ్చే పాటకా మనసుకవి ఆత్రేయ ‘ఆలుమగలు’అన్న చిత్రానికి, ‘‘ఒకటి ఒకటి మానవులందరు ఒకటి’’ అంటూ ఒకటినుండీ పదిదాకా, వచ్చేలా అంకెలతోకూర్చి, ఒక ప్రబోధ గీతం వ్రాసారు. ఇందులో మానవులందరు ఒకటైనా మంచివాళ్ళని, చెడ్డవాళ్ళనీ మనలో జాతులు రెండు అంటారు ఆత్రేయ. మూడు మూడు మూఢుల స్నేహం వీడు, నాలుగు నాలుగు నాలుగు నలుగురి సుఖము చూడు, ఐదు వేళ్ళలా ఐకమత్యం కలిగి ఉండాలి, ఆరునూరైనా నూరుఆరైనా అబద్దం ఆడకూడదు అని చెప్తూ, ఏడు ఏడు ఏడు ఇతరుల చూచి ఏడవకు, ఎనిమిది వరకూ నిద్రించవద్దు. తొమ్మిది తరవాత మేల్కొని ఉండకు, పదిమందీ నిను మంచివాడని పొగడగానే పొంగిపోకు అని హెచ్చరిస్తూ, తమాషాగా క్లుప్తంగా అతి చిన్న పాటగా ఎంతో అర్ధంచెప్పిన ఈ పాటంటే నాకెంతో ఇష్టం. అంతే అందంగా బాణీ అందించిన మామ మహదేవన్, పాటకు అలవోకగా తన కంఠంతో మరింత ప్రాచుర్యాన్ని చేకూర్చి మైమరపించిన ఘనత శే్వత కోకిల సినీ గాయని పి.సుశీల గారిది. ఆకాలంలో ప్రతి చిత్రంలో ఓ ప్రభోద గీతం ఉండేది. ఆ గీతాల్లో పాటల రచయతలు ప్రజలకు మేలు చేసే ఎన్నో మంచి మాటలను, సామెతలను, తెలుగు పలుకుబడులను గుదిగుచ్చి పాటలుగా అందించేవారు. ఇప్పుడు అలాంటి పాటలే రావడం లేదు. పాత పాటలు ఇప్పటికీ ఆపాత మధురాలు అనడం ఇందుకేనేమో. అప్పటి పాటలు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు. షావుకారు జానకి నటించిన అనేక పాటలలో ఈ పాట వైవిథ్యంగా సాగి శ్రోతలను అలరిస్తుంది. పిల్లలకు పాటల ద్వారానే అంకెలు, అక్షరాలు చెప్పే పద్ధతి ఆ కాలంలో ఉండేది. అదే పద్ధతిని ఈ పాటలో రచయత ఆత్రేయ సరికొత్తగా పరిచయం చేశారు. ప్రతి అంకెకు ఆయన చెప్పిన మనుషులంతా ఒకటని, జాతులు రెండని, మూడుల స్నేహం వీడమని, నలుగురి సుఖాన్ని కోరమని చెప్పే మంచి మాటలు ఇప్పుడు ఏ పాటల్లో వినిపిస్తున్నాయ. అందుకే ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం.
-యం.వి.రమణకుమారి, హైదరాబాద్