Others

వైజ్ఞానిక ఆలోచనలకు వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జన విజ్ఞాన వేదిక జనంలో ఒక కదలిక’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న జన విజ్ఞాన వేదిక తెలంగాణ, గత 32 సంవత్సరాల కాలం నుండి శాస్ర్తియ దృక్పథాన్ని సామాన్య ప్రజానీకంలో మరియు ముఖ్యంగా విద్యార్థులలో పెంపొందిస్తున్న ఏకైక ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థ. మూఢ నమ్మకాల నిర్మూలనకు మరియు వైజ్ఞానిక అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా, అనేక సామాజిక అంశాలైన విద్య, వైద్యం, పర్యావరణంపై చైతన్య కార్యక్రమాలతో తనదైన రీతిలో స్పందిస్తూ, సమకాలీన శాస్త్ర సాంకేతిక ఫలాలను సామాన్య మానవునికి చేరవేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కృషిచేస్తున్న శాస్త్ర ప్రచారం సంస్థగా గుర్తింపు పొందింది. ప్రజలకోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్ అంటూ చారిత్రకంగా ఎన్నో వైజ్ఞానిక మైలురాళ్ళనుదాటి ఎంతోమంది మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగస్థులు, యువకులు, విద్యార్థుల కలయికతో స్వచ్ఛందంగా నడుస్తున్న సంస్థ జన విజ్ఞాన వేదిక తెలంగాణ. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1990 నుండి ‘విద్యార్థి చెకుముకి’ అనే తెలుగు వైజ్ఞానిక సైన్స్ మాసపత్రికను నడిపించడం జరుగుతోంది. ఈ మాసపత్రిక పేరుమీద ప్రతి ఏటా లక్షలాది మంది పాఠశాల విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా ‘చెకుముకి సైన్స్ సంబరాలు’ పేరుతో ఒక పెద్ద సైన్స్ పండగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా తెలుగు మరియు ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం మరియు తమచుట్టూ జరుగుతున్న సమకాలీన శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆలోచింపజేసే ప్రశ్నలతో పాఠశాల, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ‘చెకుముకి ప్రతిభ పరీక్ష’ను నిర్వహించడం జరుగుతుంది.
గొప్ప వైజ్ఞానిక భావాలతో కూడిన చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్ష విద్యార్థుల్లో సైన్సు ప్రావీణ్యత పెంపొందించడానికి, సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి, సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి, శాస్ర్తియ ఆలోచనలు, పరిశీలనాసక్తిని రేకెత్తించడానికి, సైన్స్ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి, శాస్ర్తియ దృక్పథాన్ని పెంపొందించడానికి మరియు భవిష్యత్తు శాస్తవ్రేత్తలుగా ఎదగడాని తోడ్పడే విధంగా ‘చెకుముకి సైన్స్ సంబరాలు’ పేరుతో తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్షణ (ఎస్‌ఎస్‌ఎ) విభాగం తోడ్పాటుతో ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లాలోని పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలో పాఠశాల స్థాయిలో వ్యక్తిగత ప్రతిభను, మండల మరియు జిల్లా స్థాయిలో జట్టు ప్రతిభను పరీక్షించి శాస్ర్తియ మేధస్సుగల విద్యార్థులతో ఈనెల 25, 26 తేదీలలో వనపర్తి జిల్లా కేంద్రంగా సైన్స్ పండగను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పాల్గొనే విద్యార్థులు ఒక శాస్ర్తియ అంశంపై ప్రాజెక్టు తయారుచేసి ప్రదర్శించే గొప్ప అవకాశంతోపాటు, అక్కడ నిర్వహించే వినూత్నమైన సైన్స్ క్విజ్‌లో పాల్గొని బహుమతులు గెలుపొందవచ్చు. అదేవిధంగా విద్యార్థులు శాస్తవ్రేత్తలతో తన భావాలను పంచుకునే ‘శాస్తవ్రేత్తలతో పరిచయం’ లాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములై మంచి అనుభూతి పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ సైన్స్ పండగ కార్యక్రమానికి 33 జిల్లాల విద్యార్థులకు వైజ్ఞానిక అభినందనలతో స్వాగతం పలుకుతోంది.

- సంపతి రమేష్ 9959556367