Others

చెరువు నిండింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరి చెరువు నిండారై
మత్తడి పారినాక పరదేశం పోయే
పనేమున్నది నిర్వాజ్యం పల్లె!
నాల్గుగుంటల భూమైతేనేం
కుంటుపడకుండ సూసుకుంటే
కలకాలం కుబేరులమన్నట్లే
కుచేలుని కాలం పోయేనట్లే
ఇక పడితి వడుగడు మాటలేదు
కాపుకు గడియ తీరికెక్కడిది
నిద్రల గూడ ‘పంటభూదేవి’
కలలకచ్చి తడిపెట్టుమని లేప్తది
పాల పాలలెక్క
ఒక్కో వడ్లగింజ మీద
సెరువు పేరే ఉంటది తియ్యగా
ఏ ఊరికైనా తొణుకులాడె
పెద్ద సెరువే బలం బలగం ఆత్మ!
పరాయి దేశం వలససోల్పులకు
గడియ పడ్డట్టే
గొల్లెం పెట్టి తాళమేనట్లే!!
తెలంగాణ వచ్చినాక
కరువుతీరా తీరుతీరుగా
సెరువుల మాటముచ్చట
పండ్గనే ఊరంతటికీ
పల్లెపల్లెకు జాతర సెట్లకింద
అంటలండుకునుడు!
పరదేశంకు పోయినోల్లు
ఎవరూరికి ఆల్లు ఆస్తనే ఉన్నరు
ఎవరూరి పాణం ఆల్లను
గుంజనే గుంజుతది!
మర్లాఅయిసు పోరగాల్లతోని
ఊరు నిండుతనే ఉన్నది!

- కందాళై రాఘవాచార్య 9908612007