Others

ఆచూకీ లేని హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగడుగునా
పురుషాహంకార కంటకాలు
పాదాలకు గుచ్చుతున్నా
బతుకు పుస్తకంలో
అణచివేత పుటలు దర్శనమిస్తున్నా
అన్ని రంగాల్లో దూసుకుపోయే
మగువకు హక్కుల రక్షణ ఏది?

బతుకు తొక్కిసలాటతో
పెత్తందారుల దౌర్జన్యపు ఇరుకు గదిలో
దగాపడ్డ గుండెతో
ఘరానా నేరగాళ్ళల్లా ఎగరలేక
ఊపిరి బిగపట్టిన బతుకు తిత్తుల్లో
ఆశల గాలులు నింపి లేని రేపటిని
విశ్వాసంతో శ్వాసించే
శ్రామికుల హక్కుల రక్షణేది!

ఆశల వలలో
మేథోవలసల దొంతరలో
వృద్ధాశ్రమాల బాసటలో
మాతా పితలను పరిత్యజిస్తుంటే
జీవన సంధ్యకు వెలుగేదీ?

అడుగడుగు తిష్టవేసిన
లింగభేదపు అంతరాల్లో
పెడతోవపు సాంకేతికతో
భ్రూణహత్యల పరంపరలో
గర్భస్థ శిశూదయం ఎప్పుడు?

పంట చేలకు
విషపూరిత రసాయనాల్ని విచ్చలవిడిగా చల్లి
పసితనాన్ని ప్రాయానికి తెస్తోంటే
ఏది? మనుగడకి రక్షణ?

రహదారుల వెంబడి
కనుల కెమెరాలు తగిలించి
బినామి సాగుకు స్వంతం చేసుకుంటోన్న
తెల్లదుస్తుల దారుల్నుండి
ఏది సగటు మనిషి హక్కుల రక్షణ?

ఎన్నికల క్రతువులో పేదరికం ఓడి
అవినీతి గెలుస్తుంటే
హక్కుల కోసం ఎత్తిన చేతులకు
ఆక్రందనల ఆనవాళ్ళు ఎదురవుతుంటే
ప్రశ్నించే గొంతు ఎలుగెత్తేదెన్నడు?

ప్రాణావసరమైన పర్యావరణం
ఉల్లంఘనల చెరలో పడుతూంటే
భావితరానికి దిక్కేది?
ఆరుగాలం చెమటోడ్చి
ఆశల పెట్టుబడుల జోడించి
వండిన పాయసం వాయసం పాలైనట్టు
పండిన పంట దళారీ వైపరీత్యాల చేజిక్కి
రైతన్న బతుక్కి చావే శరణ్యమైతే
ఎవరికి ఏమని చెప్పుకోవాలి?

నిరంతర చైతన్యమే బాసట
ఉదాసీనం వదిలేస్తే అంతటా ఊరట

- వేమూరి శ్రీనివాస్ 9912128967