Others

నా ఆటోగ్రాఫ్.. ( నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, భూమిక, గోపిక ప్రధాన పాత్రల్లో ప్రముఖ ఫొటోగ్రాఫర్ యస్ గోపాలరెడ్డి నిర్మాత, దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నా ఆటోగ్రాఫ్...స్వీట్ మెమరీస్’. రవితేజ శీను పాత్రలో లీనమై నటించాడు. ప్రతిఒక్కరి లైఫ్‌లోని తీపి జ్ఞాపకాలు గుర్తుచేసేలా హీరో పాత్ర ఉంటుంది. వివిధ దశల్లో హీరో జీవితంలోని అత్యద్భుత జ్ఞాపకాలుగా ప్రతి సన్నివేశాన్ని అద్భుత కావ్యమే చేశాడు దర్శకుడు. హీరో రవితేజ ప్రియుడిగా... బాధ్యతగల కొడుకుగా... తర్వాత జీవితంలో స్థిరపడే యువకుడిగా... మంచి మిత్రుడిగా అద్భుతమైన పాత్ర పోషించాడు. చివరలో మిత్రులందరినీ పెళ్ళికి పిలవడానికి వెళ్తూ... తన జ్ఞాపకాలను అలా మదిని స్పృశిస్తూ.. ఓ సామాన్య యువకుడిగా.. ఓ కొడుకుగా.. బాధ్యతగల ఉద్యోగిగా రవితేజ పాత్ర మన జీవితంలోని ఎన్నో విషయాలను గుర్తు చేసేదిగా ఉంటుంది. ‘మన్మథుడే బ్రహ్మనుపూని...’ పాటలో మలయాళంలోని అనేక పదాలను తెలుగుకు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు రచయత. కైకుం అంటే కాకరకాయ అంటూ ప్రేయసి చేసే చిలిపి అల్లరి సినిమాలో ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టింది. ప్రియుడి వలపు వేడిని తగ్గించాలంటే ఎన్నో జలపాతాల నీటిని గుమ్మరించాలంటొ పాటలోని అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్ ఎప్పటికీ మరువలేం. ‘గుర్తుకొస్తున్నాయి’’...అంటూ హీరో జర్నీలో వచ్చే పాట.. ఓ జ్ఞాపకాల మూటే. ఈ పాట హృదయాన్ని టచ్ చేస్తుంది. చిన్నప్పటి అల్లరి, దోస్తులతో వేసిన వేషాలు, అమ్మానాన్నలకు తెలీకుండా చేసిన దొంగపనులు.. ఇలా బాల్యంలోని అల్లరిని చెబుతూనే, ఫ్రెండ్ చనిపోయనపుడు కలిగిన బాధను ఎక్స్‌ప్రెస్ చేసిన తీరు కంట తడిపెట్టిస్తుంది. మరోపాట ‘వౌనంగానే ఎదగమని...’ అంటూ రచయత చంద్రబోస్ రాసిన పాట మరో అత్యద్భుతం. అంధులతో భూమిక పాడే పాట జీవిత సత్యాన్ని తెల్పుతుంది. వౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది/ ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది/ అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది/ ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది -అంటాడు చంద్రబోస్. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా.. దరికి చేరు దారులు కూడా ఉన్నాయగా/ భారమెంత ఉందని బాధపడుకు నేస్తమా.. అంటూ కష్టాలలో ధైర్యాన్నిచ్చే పాటగా అనిపిస్తుంది. నాకునచ్చిన ఈ సినిమా జయాపజయాలను పక్కనపెడితే... హాయిగా అందరూ తమనుతాము స్పృశించుకొని.. తమ గత జీవితపు తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఖచ్చితంగా. ఏ రూపంలోనైనా మదిని తాకే చిత్రం ‘నా ఆటోగ్రాఫ్..స్వీట్ మెమరీస్..’
-రంగరాజు, భీమునిపట్నం