Others

సెలీనియం పెంచే నట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె పదికాలాలపాటు ఆరోగ్యంగా కొట్టుకోవాలనుకుంటున్నారా? అయితే క్రమం తప్పకుండా రోజూ గుప్పెడు గింజలను తినండి అని చెబుతున్నారు వైద్యులు, పోషక నిపుణులు. గింజల్లో ఉండే అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది. అందుకే మునుపు స్వీట్లలోనూ, పాయసాల్లోనూ కనిపించే డ్రైఫ్రూట్స్.. ఈ మధ్య అన్ని ఇళ్లల్లోనూ స్నాక్‌ఫుడ్‌గా మారుతున్నాయి.
రోజుకి ఒక్కటి లేదా రెండు తిన్నా చాలు.. శరీరానికి అవసరమయ్యే రోజువారీ సెలీనియం నూటికి నూరు శాతం దొరుకుతుంది ఈ నట్స్‌తో.. ఎముక, ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు, థైరాయిడ్ హార్మోన్ పనితీరుకి, హృద్రోగాలు, కాలేయ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ సెలీనియం ఎంతో అవసరం. పుండ్లు త్వరగా తగ్గేందుకు కూడా ఇది సాయపడుతుంది. ఆహారం ద్వారా జింక్ తీసుకోలేనివాళ్లకు ఈ నట్స్ అందేలా చేస్తాయి. అయితే సెలీనియం ఎక్కువైనా కష్టమే కాబట్టి వీటిని అతిగా తినకూడదు. అమేజాన్ అడవుల్లో ఎక్కువగా పెరిగే బ్రెజిల్‌నట్స్ బీకాంప్లెక్స్‌కీ మంచి నిల్వలు. స్థానికులకు ఇవే శక్తి వనరులు.
వంద గ్రాముల బ్రెజిల్ నట్స్‌లో..
శక్తి: 656 కేలరీలు
పిండిపదార్థాలు: 12.27 గ్రాములు
శాచ్యురేటెడ్: 15.1 గ్రాములు
మోనోఅన్‌శాచ్యురేటెడ్:
24.548 గ్రాములు
పాలీఅన్‌శాచ్యురేటెడ్:
20.577 గ్రాములు
ప్రొటీన్లు: 14.32 గ్రాములు
విటమిన్ ఇ: 5.73 గ్రాములు
కాల్షియం: 160 మిల్లీగ్రాములు
మెగ్నీషియం: 376 మిల్లీగ్రాములు
ఫాస్పరస్: 725 మిల్లీగ్రాములు
పొటాషియం: 659 మిల్లీగ్రాములు
సెలీనియం: 1917 మైక్రోగ్రాములు