AADIVAVRAM - Others

ఉన్నతాధికారులు - వారి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడెమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*
న్యాయ విద్వాంసుడు ఎస్.రామచందర్‌రావు చేసిన తీవ్రమైన విమర్శలను అర్థం చేసుకోవడానికి, రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన సూత్రాలను అర్థం చేసుకోవాలి. కింది ఆర్టికల్స్ 54, 57, 75 మరియు 77 ప్రభుత్వ అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి, మంత్రుల మండలిని రాష్టప్రతి నియమించే విధానాన్ని నిర్దేశిస్తాయి. ఆర్టికల్ 144 న్యాయవ్యవస్థ లేదా కోర్టు ఆదేశాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ యొక్క విధిని నిర్దేశిస్తుంది.
మెజారిటీ పార్టీ సభ్యులు ప్రధానిని ఎన్నుకుంటారు. వాస్తవానికి పార్టీలోని సీనియర్ సభ్యులు ‘కింగ్’ మేకర్స్. వారు ఒకవైపు పార్టీ సభ్యులను అదుపులో ఉంచుతారు. మరోవైపు ప్రధానిని నియంత్రిస్తారు. ఈ విధంగా ప్రధాని మనుగడ చాలా సున్నితంగా పార్టీ సభ్యులను సంతోషంగా ఉంచడంపై ఆధారపడి ఉంటుంది మరియు పార్టీ స్థాయి లేదా ప్రభుత్వ స్థాయి స్థానాలు లేదా సహాయాలు ఇవ్వటం సీనియర్ నాయకులు పార్టీ సభ్యులను అంటే తక్కువ క్యాడర్‌లో వారిని ఎంత సమర్థవంతంగా అదుపులో ఉంచుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ మనుగడ దేశం శ్రేయస్సు ప్రభుత్వ నిధులతో ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. తరువాతి వ్యాసాలలో మేము భారత రాజ్యాంగాన్ని అమెరికా మరియు గ్రేట్ బ్రిటన్లతో పోలుస్తాము. భారత రాజ్యాంగం బలహీనమైనది. ఎందుకంటే అవినీతిని నియంత్రించగలిగేంతగా ప్రధాని బలంగా ఉండటానికి ఇది ఎప్పుడూ అనుమతించదు. ఇది జంతువులను నియంత్రించడానికి ఉపయోగించే మెడలో వేలాడుతున్న బరువు లాంటిది. కాబట్టి వారు తమను తాము బాధించకుండా అరుదుగా నడపగలరు. భారత ప్రధాని యొక్క దురదృష్టకర పరిస్థితి ఇది. కింది వ్యాసాల సారాంశం ఏమిటంటే, రాష్టప్రతిని మరియు ప్రధానిని పరోక్షంగా శాసనసభ్యులు ఎన్నుకుంటారు. పర్యవసానంగా ప్రధాని తన మద్దతుదారులను అసంతృప్తి పరిచే విధంగా వ్యవహరించలేదు. మరియు ప్రధాని చర్యలను రాష్టప్రతి విమర్శించలేరు. మంత్రులు అవినీతికి పాల్పడినప్పుడు మీరు ఎక్కడికి వెళతారు? ఎక్కడికీ వెళ్లడానికి దారి లేదు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిప్రాయాలను మునుపటి వ్యాసంలో సమర్పించాము. రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ మరియు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎస్.రామచందర్‌రావు రాజ్యాంగాన్ని విమర్శిస్తూ వ్రాసిన వ్యాఖ్యలు పై పరిస్థితి నుండి వచ్చినవి.
ఆర్టికల్ 54, రాష్టప్రతి ఎన్నిక
పార్లమెంటు ఉభయ సభలలో ఎన్నికైన సభ్యులులో మరియు రాష్ట్రాల శాసనసభలతో కూడిన ఎన్నిక గణం లేక నియోజకవర్గ గణం నుండి ఎన్నికైన సభ్యులు రాష్టప్రతి ఎన్నుకోబడతారు.
వివరణ: ఈ వ్యాసంలో మరియు ఆర్టికల్ 55లో, ‘రాష్ట్రం’లో జాతీయ రాజధాని ఢిల్లీ భూభాగం మరియు పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతం భూభాగం ఉన్నాయి.
ఆర్టికల్ 57, తిరిగి ఎన్నికలకు అర్హత
ఈ రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి ప్రస్తుతం అధ్యక్షుడిగా పదవిలో ఉన్న లేదా గతంలో ఆ పదవి నిర్వహించిన వ్యక్తి అయినా ఆ కార్యాలయానికి తిరిగి ఎన్నికకు అర్హులు.
ఆర్టికల్ 74. రాష్టప్రతికి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి.
1.రాష్టప్రతికి సహాయపడటానికి మరియు సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి ప్రథమ అధికారిగా ఒక మంత్రుల మండలి ఉండాలి. ఆయన తన విధులను నిర్వర్తించటానికి సలహా సహకారాలు ఇవ్వాలి. అటువంటి సలహాలను సాధారణంగా లేదా ఇతరత్రా కారణాల వలన గాని పునః పరిశీలించమని రాష్టప్రతి మంత్రుల మండలిని కోరవచ్చు మరియు అటువంటి పునరాలోచన తర్వాత ఇచ్చిన సలహాకు అనుగుణంగా రాష్టప్రతి వ్యవహరించాలి.
2.మంత్రులు రాష్టప్రతికి సలహా ఏమైనా ఇచ్చారా అది ఏమైనా ఉంటే, ఇచ్చిన ఏ కోర్టులోనూ విచారణ చేయరాదు. సలహాల వివరాలు ప్రధానమంత్రి.
1ఎ.మంత్రుల మండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య హౌస్ ఆఫ్ పీపుల్ మొత్తం సభ్యుల సంఖ్య. పదిహేను శాతానికి మించరాదు.
1బి.పదవ షెడ్యూల్ యొక్క 2వ పేరా కింద ఆ సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హులు అయినా ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన పార్లమెంటు సభు సభ్యుడు కూడా నిబంధన (1) ప్రకారం మంత్రిగా నియమించటానికి అనర్హులు. అతని అనర్హుత మొదలుపెట్టిన తేదీ నుండి కాలం వరకు, అటువంటి సభ్యునిగా తన పదవీ కాలం గడువు ముగిసే తేదీ వరకు లేదా ఆ తేదీ లోపు అతను పార్లమెంటు సభకు ఏదైనా ఎన్నికలలో పోటీ చేస్తే ఎన్నుకోబడిన వ్యక్తిగా ప్రకటించిన తేదీ వరకు అంటే ముందు వచ్చే రోజు లేక తేదీ ననుసరించి నిర్ణీతమవుతుంది.
2.రాష్టప్రతి ఇష్టానుసారం మంత్రులు పదవిలో ఉంటారు.
3.మంత్రిమండలి లోక్‌సభకు సమిష్టిగా బాధ్యత వహించి ఉంటుంది.
4.ఒక మంత్రి తన పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు, మూడవ షెడ్యూల్‌లో నిర్దేశించిన ఫారమ్‌ల ప్రకారం రాష్టప్రతి ఆయనకు పదవీ బాధ్యత మరియు గోప్యత గురించిన ప్రమాణ స్వీకారం ఇవ్వాలి.
5.వరుసగా ఆరు నెలల వ్యవధిలో పార్లమెంటు సభలో సభ్యుడు కాని మంత్రి ఆ కాలం ముగిసే సమయానికి మంత్రిగా పదవి కోల్పోతాడు.
6.మంత్రుల జీతాలు మరియు భత్యాలు ఎప్పటికప్పుడు పార్లమెంటు చట్టం ప్రకారం నిర్ణయించబడతాయి. మరియు పార్లమెంటు నిర్ణయించే వరకు రెండవ షెడ్యూల్‌లో పేర్కొన్నట్లు ఉండాలి.
ఆర్టికల్ 144
భారత భూభాగంలో ఉన్న సివిల్ మరియు జ్యుడిషియల్ అందరు అధికారులు సుప్రీంకోర్టుకు సహాయంగా వ్యవహరించాలి.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రాసిక్యూషన్: ముందు అనుమతి: ఆర్టికల్ 144
ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు ముందస్తు అనుమతి కావాలి అనే నియామకం
సత్యాన్ని స్థాపించడానికి ఉన్న దర్యాప్తు సంస్థల బాధ్యతలతో జోక్యం చేసుకుంటుంది. ఇది న్యాయ స్థాపన కోసం వేయవలసిన మొదటి మరియు అన్నిటికంటే ముందడుగు, సుప్రీంకోర్టు మరియు కోర్టు వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం.
ఇది న్యాయస్థాపన అడ్డుకోవటానికి ఉపయోగపడే సాధనంగా మారింది మరియు ఆర్టికల్ 144తో జోక్యం చేసుకుంటుంది.
చట్టం అమలు మరియు పరిశోధనా విభాగాల పరిస్థితి దేశ ప్రయోజనాల బదులు వారి స్వ ప్రయోజనాలు చూసుకునే ఉద్యోగి యొక్క పర్యవేక్షకుల దయ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ముఖ్యమైన పరిణామంలో సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తి ధర్మాసనం జస్టిస్ చలమేశ్వర్ మరియు సంజయ్ కిషన్ కౌల్లతో కూడి మంగళవారంనాడు ఒక పెద్ద బెంచ్ పరిశీలన కోసం 1973 ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973’లోని సెక్షన్ 156 (3) కింద దర్యాప్తు ప్రక్రియను కూడా ప్రారంభించడానికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అవినీతి ఆరోపణలకు ప్రాసిక్యూషన్ కోసం ముందస్తు అనుమతి అవసరమా అనే ప్రశ్నను ప్రస్తావించింది.
(ప్రచురణ, 27 మార్చి 2018)
న్యాయ విద్వాంసులు ఇచ్చిన తీర్మానాల్లో ప్రతిబింబించిన విధంగా ‘ముందస్తు అనుమతి అవసరం’ అనే నియమం యొక్క ఫలితం దేశంలో అరాచకం.
ఇది దేశం యొక్క శ్రేయస్సు మరియు భద్రతకు కలిగించే భారీ నష్టం ఖగోళశాస్త్ర పరిమాణాల సంఖ్యలతో పోల్చవచ్చు. అవినీతి కేన్సర్ వంటి దేశంలోని నైతిక ఫైబర్‌ను నాశనం చేసింది. ప్రాసిక్యూషన్ కోసం మంజూరు చేయవలసిన అనుమతి అవసరం ప్రభుత్వంలోని అవినీతిపరులకు పై నుండి క్రిందికి కవచంగా మారింది.
మాజీ పర్యావరణ మంత్రి జైరామ్ రమేష్: ‘మా నగరాలు ప్రపంచంలోని అత్యంత మురికినగరాలు, ధూళి మరియు మలినాలకు నోబెల్ బహుమతి ఉంటే, భారతదేశం దానిని గెలుచుకుంటుంది. సందేహం లేదు’
గాలి, నీరు మరియు ఆహారంలో కాలుష్యం నిస్సందేహంగా చిన్నా పెద్దా అనే భేదం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అప్పుడు ఆరోగ్యం అన్నింటి కంటే గొప్ప సంపద అనే మంచి పాత సామెతను ప్రజలు గ్రహించగలరు.
ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలి? సంక్షిప్త సమాధానం ఏమిటంటే ‘కెరీర్ ప్రభుత్వ సేవకుడిని పరిశోధించడానికి లేదా విచారించడానికి ముందస్తు అనుమతి’ అవసరాన్ని తొలగించడం ద్వారా అవినీతిని నియంత్రించవచ్చు.
ఆర్టికల్ 144
భారత భూభాగంలో ఉన్న సివిల్ మరియు జ్యుడిషియల్ సంబంధించిన అన్ని అధికారులు సుప్రీంకోర్టుకు సహాయంగా వ్యవహరించాలి.
ఈ క్రింది విధంగా సవరించాలి.
ఈ సూత్రం అన్ని స్థాయిలలోని అన్ని అధికారులకు సంబంధించి కొత్తగా చేసే ఏదైనా చట్టం, నియమం, నియంత్రణ లేదా నిబంధన మరియు వాటి సడలింపును అధిగమించిన అత్యోన్నత రాజ్యాంగ సూత్రం.
కెరీర్‌ను ప్రభుత్వోద్యోగి దర్యాప్తు చేయడానికి లేదా విచారించడానికి ముందస్తు అనుమతి ప్రభుత్వ కేబినెట్ మంత్రుల కేసులలో తప్ప అవసరం లేదు. అది సుప్రీంకోర్టు నిర్వహిస్తుంది.
ప్రస్తావనలు
1.మురికి, మలినాలకు భారతదేశం నోబెల్‌కు అర్హమైనది: జైరామ్
https:// www.hindustantimes.com /india/india- deserves- noble-for- dirt-filth -jairam/story - Gutpvwm EapoP5S6DCiZ1CP.html
2.దర్యాప్తు U/S 156 (3) CrPC కోసం ప్రభత్వ సేవకుడిపై ఫిర్యాదును సూచించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి?’ ప్రశ్న పెద్ద బెంచ్‌కు సూచించబడింది.https:// www.livelaw.in/ breaking-prior -sanction - mandatory - referring - complaint - public - servant - investigation-u-s- 1563- crpc - question - referred - larger - bench/
3.కార్పొరేటర్లను విఛారించడానికి ఇప్పుడు ప్రభుత్వ అనుమతి ఉండాలి.
https:// timesofindia.indiatimes.com/ city/ nagpur/Government - sanction- now- must- to- prosecute- corporators/ articleshow/ 14111491.cms