Others

కృష్ణ భక్తుల సమాగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభప్రదమైన మార్గశీర్షమాసం శుక్లపక్షం వెన్నల నిండిన రాత్రులు కలది. స్నానము చేయు తలంపుకల వారందరూ రండి అని ఆండాళ్ తల్లి పిలుస్తున్నది. చక్కని ఆభరణములు ధరించి, సకల సంపదలు నిండిన గోపకులములోనున్న గోపికలారా! వేలాయుధమును ధరించిన నందుని కుమారుడు, విశాల నేత్రాలు కల యశోదబాలసింహం నీలమేఘశ్యాముడు, అరుణ నేత్రుడు, సూర్యచంద్ర సన్నిభముఖుడుగు శ్రీమన్నారాయణుడే మన వ్రతసాధనమును అనుగ్రహించును. లోకాలన్నీ ఆనందిచును రండీ అని ఆండాళ్ తల్లి గోపికలను అంటే కృష్ణ భక్తులందరినీ పిలుస్తోంది. అంటే స్నానం అంటే శ్రీకృష్ణసమాగం. శ్రీకృష్ణ సమాగమ కోరిక ఉన్నవారంతారండి అని పిలవడం ఆండాళ్ ఉద్దేశం. భగవంతుని కైంకర్యం మంచిదే కనుక వాతావరణం, కాలం అన్నీ తమకై తాము సమకూరుతాయి. భగవంతుని సేవచేద్దామనుకోవడమే మన ఐశ్వర్యం. ‘మంత్రోమాతా గురుఃపితా’ అని ప్రమాణం కదా. యశోద తల్లి అనగా మంత్రం. నందగోపుడు అంటే ఆనందాన్ని కాపుకాచేవాడు. ఆనందనగాపరమాత్మ. అతనిని అయోగ్యులకు అందకుండా కాపాడేవాడు ఆచార్యుడు. కనుక ఈ వ్రతాచరణమునకు తగిన సాధన సంపత్తిని కోరి కూర్చుకుందాంరండి అని ఆండాళ్ తల్లి కృష్ణ భక్తులకు బోధిస్తున్నది.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899