AADIVAVRAM - Others

గాన గంధర్వుడు ఘంటసాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘంటసాల జయంతి సందర్భంగా వచ్చిన వ్యాసం (ఆదివారం 01.12.19) చాలా బాగుంది. అయితే కొన్ని చేర్పులు మార్పులు అవసరం.
‘అన్ని భాషలలో ఘంటసాల దాదాపు పదమూడు వేలకు పైగా పాటలు పాడి, 107 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు’ అన్నది ఘంటసాల మీద భక్తి, అభిమానం వలన వ్యాసకర్తలందరూ పొరబడే మాటే.
నిజానికి ఘంటసాల గాయకుడిగా ఉన్న కాలం (1945-1974)లో వచ్చిన తెలుగు మరియు డబ్బింగ్ చిత్రాలు 1328. వాటిల్లో ఆయన పాడిన చిత్రాలు కేవలం 656. చివరకు అన్ని భాషలలో ఆయన పాడిన గీతాల సంఖ్య (19 ప్రైవేటు గీతాలతో సహా) 2434. అలాగే తెలుగు (83), తమిళం (13) కన్నడం (7) మరియు డబ్బింగ్ (2) చిత్రాలతో కలిపి ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు 105. ఘంటసాల వీరాభిమాని, ‘ఘంటసాల గాన చరిత’ పుస్తక రచయిత చల్లా సుబ్బారాయుడు (కనిగిరి, ప్రకాశం జిల్లా) పుష్కర కాలం పరిశోధనలు సలిపి నిగ్గుతేల్చిన సత్యమిది.
ఘంటసాల ‘పరోపకారం’ (1953) నిర్మించిన మాట వాస్తవమే కానీ అదే వరుసలో సొంతవూరు (1956), భక్తరఘునాథ (1960) చిత్రాలు కూడా నిర్మించి చేతులు కాల్చుకున్నారు. చిత్రసీమలో తనకు భవిష్యత్తు ఏర్పరచిన సముద్రాలకు కృతజ్ఞతగా చివరి చిత్రం సముద్రాల దర్శకత్వంలో నిర్మించారు.
ఏమైనా ఘంటసాల గూర్చిన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను సమన్వయించుకుంటూ సమగ్రంగా సంక్షిప్తంగా చక్కగా వ్యాసం సాగింది. రచయితలు కృతజ్ఞతలు.

-ఆర్.వి.రాఘవరావు 9440 232760