Others

ఎంటర్‌టైన్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంజెలార్నా. పేరే కొత్తగా ఉంది కదూ. ప్రతిరోజూ పండగే చిత్రంలో పాత్రకూడా అలానే డిఫరెంట్‌గా ఉంటుంది. నా పాత్రకు చాలామంది కనెక్టైపోతారు.
సాయితేజ్, రాశిఖన్నా జోడీగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం -ప్రతిరోజూ పండగే. తాతా మనవళ్ల అనుబంధాన్ని మరోసారి తెరపై చూపించనున్న చిత్రమిది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్లపై నిర్మితమైన చిత్రం డిసెంబర్ 20న థియేటర్లకు వస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం మీడియాతో ముచ్చటించింది రాశిఖన్నా.
* సినిమాలో నా పాత్ర పేరు ఎంజెలార్నా. టిక్‌టాక్ పిచ్చివున్న అమ్మాయిగా యునీక్ క్యారెక్టర్ చేస్తున్నా. ఈ ప్రాజెక్టుకు వచ్చే వరకూ టిక్ టాక్ మీద నాకు సదభిప్రాయం ఉండేది కాదు. పాత్రకోసం యాప్ గురించి తెలుసుకున్నా. ఈ యాప్‌లోని ఫన్‌కు ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్నా.
* ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో సినిమాను అభిమానించే వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్ల టాలెంట్‌ను చూపించటానికి టిక్ టాక్ ఓ ప్లాట్‌ఫాంగా మారిందని అర్థమైంది. రాజమండ్రిలో ఉండే అలాంటి అమ్మాయిగా కనిపించేందుకు నావంతు నేను కృషి చేశా.
* దర్శకుడు మారుతికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. అందుకే హీరోయిన్ పాత్రను ఇలా డిజైన్ చేశారని అనుకుంటున్నా. బట్, నా క్యారెక్టర్ చాలామందికి కనెక్టవుతుంది.
* చాలాకాలం క్రితం జిల్ చిత్రంలో బబ్లీ రోల్ చేశా. మళ్లీ.. పండగే చిత్రం కోసం బబ్లీగా కనిపిస్తున్నా. నిజంగానే గుర్తుంచుకోదగిన పాత్ర. ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది.
* సినిమా మొత్తం సంప్రదాయబద్ధంగానే కనిపిస్తా. రాజమండ్రిలో ఉండే అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే హాఫ్‌శారీ అప్పియరెనే్స ఉంటుంది. బట్, ఓ పాట కోసం మోడ్రన్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపిస్తానంతే.
* నేను చేసిన వెంకీమామ థియేటర్లలో ఉంది. ప్రతిరోజూ పండగే విడుదలకు సిద్ధమైంది. వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ నడుస్తుంది. షూటింగ్ క్లాష్ అయినపుడు -్భన్నమైన పాత్రలు చేయడానికి కొంత ఇబ్బందిపడ్డాను. కానీ, ఆర్టిస్టుగా ఆ వత్తిడి నాకు సంతృప్తినిచ్చింది.
* మారుతి మంచి దర్శకుడు. రియల్ లైఫ్‌లోనూ చాలా హ్యూమర్ చూపిస్తాడు. తనకు కావాల్సింది ఆర్టిస్టుల నుంచి తీసుకోగల దర్శకుడు. ఆయనతో పని చేయడం హ్యాపీ.