Others

అలా.. అన్నమాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.పుల్లయ్య దర్శకత్వం వహించి కె.వి.రెడ్డి స్క్రీన్‌ప్లే వ్రాసిన చిత్రం ‘ధర్మదేవత’ (1952), స్వంత చిత్రానికి కాకుండా వేరే దర్శకుని చిత్రానికి కె.వి.రెడ్డి స్క్రీన్‌ప్లే వ్రాయడం విశేషం. కథ సంభాషణలు త్రిపురనేని గోపీచంద్ వ్రాశారు. కౌశిక్ అనే కొత్త యువకుడు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆయన సరసన గిరిజ నటించింది. ఈ చిత్రం తర్వాత కౌశిక్ ఏ.వి.యం.వారి ‘సదారమ’ (1952)లో కూడా నటించాడు. లింగమూర్తి, ముక్కామల, లలిత, శాంతకుమారి, నల్లరామ్మూర్తి యితర పాత్రలు ధరించారు. రేలంగి, జిక్కీ ‘విరిసే వెనె్నలలో వెంటా జంటా వుండాలోయ్ జతకూడి పలుకాడే పడుచే వుండాలోయ్’అనే పాటను, శాంతకుమారి ‘మీలాంటిదేనండి మావనె్నపాప’అనే పాటను పాడటం విశేషం. ఇటువంటి కథాంశంతోనే మీనాకుమారి, దిలీప్‌కుమార్ నటించిన ‘యహూది’ తయారైంది.
*షావుకారు, పల్లెటూరు, పెళ్లిచేసిచూడు చిత్రాలలో అభ్యుదయ భావాలుకల ఆదర్శ యువకునిగా నటించిన యన్.టి.ఆర్ తొలిసారిగా విలనీ టచ్ వున్న పాత్ర ధరించిన చిత్రం ‘పరివర్తన’ (1954) ఆయనకు ప్రతిగా అక్కినేని ఉన్నతమైన భావాలుకల పాత్ర ధరించారు. వీరిద్దరిమధ్య నలిగిన పాత్ర సావిత్రి ధరించి అందరి మెప్పును పొందింది. పినిశెట్టి ప్రసిద్ధ నాటకం ‘అన్నాచెల్లెలు’ ఆధారంగా రుూ చిత్రం నిర్మించారు. ఈ నాటకాన్ని తెరకు ఆవిష్కరించిన దర్శకుడు తాతినేని ప్రకాశరావు. సుంకర మాటలు బుల్లెట్లను మరిపించాయి. అనిశెట్టి పాటలకు టి.చలపతిరావు కూర్చిన బాణీలు ప్రజాదరణ పొందాయి. కలెక్టర్ కావాలనుకున్న అక్కినేని బస్ కండెక్టర్‌గా మారటం, అక్కినేని చెల్లెలుగా తొలిసారి సావిత్రి నటించటం, జైలులో ‘కలికాలం రా కలికాలం యిది ఆ కలికాలం రా’ పాట పాడుతూ గెస్ట్‌పాత్రలో జోగారావు కన్పించటం, హేమంత్‌కుమార్ తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘ఆనంద్‌మఠ్’లోని ఒక పాటను అనుకరించి ‘అమ్మా అమ్మా అవనీ మాతా’ పాట వరసలు తయారుచెయ్యటం వంటివి రుూ చిత్రంలోని విశేషాలు.
*‘భక్తప్రహ్లాద’(1931)లో ప్రారంభమైన తెలుగు సినిమా త్వరలో తొంభై యేళ్లు పూర్తి చేసుకోబోతున్నది. నాటినుంచి నేటివరకు తెలుగు సినిమాల ప్రగతిని పరిశీలిస్తే సమస్యాత్మక సామాజికాలు 1940 తర్వాత ప్రారంభమైనా 1950-59 దశాబ్దంలో తయారైన చిత్రాలు చరిత్రాత్మకమైనవి. తెలుగువెలుగు బాటలో పాలరాయి మైలురాళ్లు. కళాత్మక విలువలు కలిగిన, కలకాలం కళ్లలో కాపురం చేసే కమనీయ చిత్రాలు రుూ దశాబ్దంలోనే తయారైనాయని పరిశీలకుల అభిప్రాయం. ఈ దశాబ్దం తెలుగు చిత్రాల స్థాయిని అపురూపమైన అంతస్థుకు గొనిపోయింది. 1950-59 దశాబ్దంలో తెలుగు చిత్రరంగం యన్.టి.ఆర్, ఏయన్‌ఆర్‌ల యుగంగా పేరుతెచ్చుకుంది. వాహిని, విజయా, భరణి, అంజలీ పిక్చర్స్, యన్.ఏ.టి, అన్నపూర్ణా వంటి సంస్థలు నిర్మించిన మహత్తర చిత్రాలు తెలుగు చిత్రాకాశంమీద ఉజ్జ్వల కాంతులను ప్రసరింపజేశాయి. కథలో, కథాగమనంలో, సంగీత సాహిత్యాలలో, దర్శక ప్రతిభలో 1950-59 దశాబ్దం తెలుగు సినిమాకు స్వర్ణయుగం.

-పూజారి నారాయణ, అనంతపురం