Others

ధర్మవరం ధగధగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా శుభకార్యం వస్తే చాలు మహిళలు పట్టుచీరె కట్టాల్సిందే. మన రాష్ట్రంలో పట్టుచీరెలు రకరకాల డిజైన్లలో, ఆధునికత ఉట్టిపడేలా పట్టు చేనేత జరీ చీరెలు లభిస్తాయి.
పట్టుచీరెలు నాణ్యంగా వుంటాయి. ఖరీదైనవి మన్నికగా నాజూకుగా వుంటాయి. ధర్మవరం పట్టుచీరెలు ప్రస్తుతం అంతర్జాతీయ ఖ్యాతి వహించాయి. మన రాష్ట్రంలో లభించే పట్టుచీరెలలో కంచి, ధర్మం, బెనారస్, వెంకటగిరి మొదలైన రకాలు, మిగతా రకాలు వున్నాయి.
వివాహాది శుభకార్యములకు పట్టుచీరెల అవసరం స్ర్తిలకు ఎంతగానో వున్నది. వస్త్ర వ్యాపార రంగంలో పట్టుచీరెలు బహుళ ఖ్యాతిని పొందాయి. మహిళలు మెచ్చే, వారికి నచ్చే పట్టుచీరెలలో ధర్మవరం పట్టుచీరెలు విశిష్ట స్థానాన్ని అలంకరించాయి.
ఎందుకంటే స్థానిక చేనేత పట్టుచీరెల వ్యాపారులు తగిన నాణ్యత పాటించి పట్టుచీరెలను తయారుచేస్తారు. శుభకార్యములకోసం ఉపయోగించే పట్టుచీరెలు ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఆధునిక డిజైన్లుతో రూపకల్పన చక్కటి అవగాహన ఇందుకు తోడ్పడగలదు. ఖరీదైన పట్టుచీరెలు నుండి సామాన్య కుటుంబాలవారు ధరించే జరీ చీరెల వరకూ ధర్మవరంలో ప్రతినిత్యం లభిస్తాయి. సినీ తారలు ధర్మవరం చీరలంటే ఇష్టపడతారు.
తిరుమల శ్రీవారికి సమర్పించే శేషవస్త్రాలు సైతం పట్టు చేనేత జరీ చీరెల తయారీదారులు తయారుచేసినవే. ఆర్డర్‌ను బట్టి ఈ శేషవస్త్రాలు తయారుచేస్తారు. గతంలో ధర్మవరానికి సైతం ఈ ఆర్డర్లు లభించడం విశేషం. స్థానిక చేనేత కళాకారుల నైపుణ్యంతో తయారుచేయు పట్టుచీరెలులో ధర్మవరం పట్టుచీరెలు పలువురి ప్రశంసలు పొందాయి. అందుకే ఈ పరిశ్రమ చేనేత రంగంలో ప్రగతి, పురోగతి సాధించింది. బ్రిటీష్ రాణి ఎలిజెబెత్ రాణికి అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరెను బహూకరించిన ఘనత పట్టుచీరెల కళాకారులదే కావడం గమనార్హం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సమీపంలోని ధర్మవరం పట్టు చేనేత పరిశ్రమ తయారుచేయు పట్టుచీరెలు జగద్విఖ్యాతినొందాయి. అందమైన రకరకాల డిజైన్లలో తయారుచేయబడ్డ పట్టు చేనేత జరీ చీరెలు మగువలకు మక్కువ. శుభకార్యాలకు పెట్టింది పేరు ధర్మవరం పట్టుచీరెలు. ఈ అందమైన చేనేత చీరెల తయారీలో మహిళల పాత్ర కూడా ఎక్కువగా వుంది. చేనేత మగ్గాలపై చీరెల్ని తయారుచేయడంలో ధర్మవరం చేనేత మహిళలు మగవారితో సమానంగా చీరెలు తయారుచేయడంలో సిద్ధహస్తులు. అందుకే ఈ పట్టుచీరెలు కళారంగంలో అత్యంత ప్రాధాన్యత వహించాయి.

- ఎల్. ప్రపుల్ల చంద్ర 88865 74370