Others

వివక్ష విస్మరించతగ్గది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అవమానంతో గాంధీ బాగా కదిలిపోయాడు. చీకటిగా ఉన్న ప్రయాణికుల గదిలో కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయాడు. ‘నేనిప్పుడు ఏంచేయాలి?’ భారతీయులను అవమానించి, చిన్నచూపుచూసే దేశంనుంచి వెళ్లిపోవాలా? ఇక్కడే ఉండి హక్కులకోసం పోరాడాలా? ఇది నా దేశ గౌరవ ప్రతిష్ఠలకు సంబంధించిన విషయం.’’ చివరకు అక్కడే ఉండిపోవాలని తీర్మానించుకున్నాడు. గాంధీ భవిష్యత్తును, కార్యాచరణను ఆ దురదృష్టకరమైన రాత్రి మలుపుతిప్పింది.
గాంధీ ఆ తర్వాత ఒక గుర్రపు బగ్గీలో ప్రయాణించాల్సి వచ్చింది. భారతీయుడు కాబట్టి ఆయన గుర్రపుబగ్గీలో కూర్చోవడానికి వీలు లేకపోయింది. బండివాడి వెనుక కూర్చుని ప్రయాణించాలని గాంధీ ప్రయత్నించాడు. కానీ కొద్దిసేపట్లోనే ఆయన అక్కడ కూర్చోవడం కుదరదన్నారు, గుడ్డ పరచిన ఫుట్‌బోర్డుమీద కూర్చోమన్నారు. గాంధీ తన సీటులోంచి లేవడానికి అంగీకరించకపోతే నిర్దయగా కొట్టారు. పట్టణంలోకి వెళ్లిన తర్వాత హోటలులో గది తీసుకుందామని గాంధీ అనుకున్నాడు. కానీ ఆయనకు గది ఇవ్వడానికి వాళ్లు తిరస్కరించారు. గాంధీ అంటే సానుభూతిగల ఒక స్నేహితుడి దుకాణంలో ఆయన రాత్రికి ఆశ్రయం పొందాడు. గాంధీ పొందిన అవమానాలేవీ ఆ స్నేహితుడికి కొత్తగా గానీ, వింతగా గానీ అనిపించలేదు. ఆ దేశంలో ప్రతిరోజూ అలాంటి సంఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అక్కడి భారతీయులు వాటికి అలవాటుపడిపోయారు. వారు ధనం సంపాదించడానికే దక్షిణాఫ్రికాకు వచ్చారు, తమ గౌరవాన్ని పణంగాపెట్టి ధనం సంపాదించడానికే దక్షిణాఫ్రికాకు వచ్చారు. వారి బానిస మనస్తత్వానికి గాంధీ ఆశ్చర్యపోయాడు. ఆయన తనకు జరిగిన అవమానాల గురించి వార్తాపత్రికలకు, రైల్వే అధికారులకు, గుర్రపు బగ్గీల అధికారులకు ఫిర్యాదులు పంపాడు.
దక్షిణాఫ్రికా రహదారులలోని ఫుట్‌పాత్‌లపై నడిచే అనుమతి భారతీయులకు లేదనీ, వారు రాత్రి 9 గంటల తర్వాత బయట తిరగడం కుదరదనీ, ట్రాము కారులో మొదటి సీటులో కూర్చోకూడదనీ కొద్దిరోజుల్లోనే గాంధీకి తెలిసిపోయింది. భారతీయులు ఇళ్లు నిర్మించుకొనేందుకు కొన్ని ప్రత్యేక కూలివాడలున్నాయి. ఒకసారి ఒక కాపలావాడు గాంధీని ఫుట్‌పాత్ మీదనుంచి నెట్టేసి, ఆయనకు ‘కూలీ బారిస్టర్’అనే పేరు తగిలించాడు. కొన్ని సౌకర్యాలు అనుభవించేలా గాంధీకి ప్రత్యేక మినహాయింపులు ఇప్పించేందుకు కొంతమంది తెల్ల స్నేహితులు ప్రయత్నించారు. గాంధీ మర్యాదగా వారి ప్రతిపాదనలను తిరస్కరించాడు. కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు పొందడంమీద ఆయనకు ఆసక్తిలేదు.
మొత్తం వర్ణవివక్షనే నాశనం చేయాలని ఆయన భావించాడు. ఆయన అవమానంతో కుంగిపోలేదు, కోపంతో రగిలిపోయి తనను అవమానించిన వారిని శిక్షించాలనుకోలేదు. ఆ పట్టణంలో నివసిస్తున్న భారతీయులు ఎదుర్కొనే సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు. ఒక వారం రోజులలోపు ఆయన ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. భారతీయులు తమ జీవన విధానం మార్చుకోవాలనీ, నిజాయితీగా జీవించాలనీ, పరిశుభ్రమైన అలవాట్లు చేసుకోవాలనీ, కుల, మత, ప్రాంతీయ బేధాలు మరిచిపోవాలనీ విజ్ఞప్తిచేశాడు. తెల్లవారిమీద నేరారోపణ చేసే ఒక్క మాటకూడా ఆయన నోట్లోంచి రాలేదు. తమ ప్రవర్తన బాగున్నప్పుడే మానవ హక్కులను కోరగలమని ఆయన తన దేశస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. ఆయన వారికి అందుబాటులో ఉంటూ వారి దీనగాథలను ఓపికగా వినేవాడు.
ఒక సంవత్సరం తర్వాత భారతీయులకు వున్న కొద్దిపాటి హక్కులలో ఒకటైన ఓటు హక్కును తొలగిస్తూ దక్షిణాఫ్రికాలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరకేంగా గాంధీ కార్యకర్తలను నమోదు చేసుకున్నాడు. ఉమ్మడి సంక్షేమానికి కలసి పనిచేసేలా క్రైస్తవ యువకులను, ముస్లిం, పార్సీ వర్తకులను, హిందూ గుమాస్తాలను ఆయన ఒప్పించాడు. గాంధీ నాయకత్వంలో కొందరు అతడు తయారుచేసిన నిరసన కరపత్రానికి నకళ్లు తయారుచేయడం ప్రారంభించారు, కొందరు డబ్బు విరాళంగా ఇచ్చారు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614