Others

కృష్ణుని అభీష్టం.. అర్జునుని సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలో యుద్ధఘట్టంలో అనగా కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథానికి సారథిగా ఉండాలి.కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు. ఆ విషయం తెలుసుకొన్న శ్రీకృష్ణుడు ఆ వైష్ణవాస్త్రాన్ని తన హృదయం తాకేలా చేసుకొంటాడు. శ్రీకృష్ణుని హృదయాన్ని తాకినటువంటి వైష్ణవాస్త్రం ఎర్రటి తామరపువ్వులాగా మెరుపులు మెరుస్తుంది. అయితే భగదత్తుడు ప్రయోగించినటువంటి అంకుశాన్ని అర్జునుడే ఎదుర్కోవాలి. కానీ అలా అర్జునుడు దాన్ని నిలువరించే సమయంలో జరగరానిదేమయినా జరిగితే పాండవ వంశం ఏమవుతుందనే బాధలో ఆ ఆపదను నివారించడానికి శ్రీకృష్ణుడు అలా చేశాడు. కానీ అర్జునుడికి అది అవమానంగా తోస్తుంది. నేను ఇంత పెద్ద పరాక్రముడినై ఇక్కడ నిల్చుని ఉండగా నీవెందుకు వేలు పెట్టావు?అని అడగలేక అడగకుండా ఉండలేక నానా యాతనలుపడ్డాడు.
కానీ మనసులోనే ఉంచుకుని ఉండడం ఇష్టం లేక ‘కృష్ణా! నామీద నీకు అపారమైన ప్రేమ, దయ ఉండడం వాస్తవమే. కానీ నేను చేయాల్సిన యుద్ధాన్ని, నీవు యుద్ధం చేయనని చెప్పిన విషయాన్ని ఎలా విస్మరించావు? అయినా ఇది నాకు బాధకలిగిస్తుందని తెలియదా నీకు’అంటాడు.
అర్జునుని నిజమైన బాధ ఏమిటో తెలుసుకునే ఈ పని చేశాను కానీ నీవు చేయాల్సిన మరోపని ఇంకా నీపైనే ఉంది. ఆ భగవదత్తుడు అతని భద్రగజం బ్రతికే ఉన్నాయి. వారు పాండవ సైన్యాన్ని చీల్చిచెండాడుతున్నారు. నీవు వాళ్లను నిలువరించాల్సిన అవసరం ఉంది. ఈ భగదత్తుడు పూర్వ యుగాంతంలో నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును భూదేవి కామించి, ఆయన దగ్గరకు వెళ్లగా ఆమెతో కలిసి వరాన్ని ఇచ్చాడు. దానివలన నరకాసరుడు జన్మించాడు. అందువల్ల నరకాసరునికి వైష్ణవాస్త్రం లభ్యమైంది, నరకాసరుని కుమారుడు కనుక ఈ భగదత్తునికి వారసత్వంగా వచ్చింది. కనుక నేను ఆ వైష్ణవాస్త్రాన్ని ఎదుర్కొన్నాను. అందులో చాలా మర్మం ఉంది. అందుకే అలా చేశాను. కానీ నిన్ను బాధపెట్టాలనీ కాదు. నాకేదో వస్తుందనీ కాదు. అని విషయ వివరణ చేశాడు. అర్జునుడికి తన మనసులో ఉన్న బాధ తీరింది. కృష్ణుడు తప్ప వేరొకరు ఎదుర్కోలేరు కనుక దాన్ని ఆయన అట్లా నిలువరించాడు. ఫర్వాలేదులెమ్మని ఇతర శత్రువులను నిర్మూలించడానికి కృష్ణుని అనుగ్రహా న్ని పొంది, శ్రీకృష్ణుని దివ్యాశీస్సులు పొంది యుద్ధరంగంలో ముందుకు వెళ్లాడు.

- పర్వతాల శ్రీనివాస్ 9014916432