Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శాంతి సహజీవనంబులు చక్కనెఱపి
ధర్మ బద్ధముగను జీవితాలు గడపి
ప్రేమ పారిజాతాలను విరివిగాను
నెల్లకాము విరజిమ్ము విలువవలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: శాంతి సహజీవనాలు విస్తృతపరిచి ధర్మబద్ధంగా జీవితాలు గడపి ప్రేమ అనే పారిజాతాలు ఎల్లకాలం విరివిగా విరజిమ్ముతూ బ్రతకాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ఈలోకానికి ప్రబోధించవయ్య స్వామి.

తే.గీ. స్ర్తిలు కన్నీరు కార్చిన రేబవళ్లు
దుఃఖమే రాజ్యమేలును తొలగు సిరులు
వారి యానందమే దేశ భవిత తీర్చి
దిద్దుననిఁ వలంపగవలె దివ్యముగనుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: స్ర్తిల కంట కన్నీరు కారితే నిత్యం దుఃఖమే రాజ్యమేలుతుంది. సంపదలన్నీ తొలగిపోతాయి. స్ర్తిల ఆనందమే దేశభవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతుందన్న భావన అంతా కలిగి యుండాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ఈలోకానికి ప్రబోధించవయ్య స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262