Others

విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిశ’ను హింసించి
ప్రాణం తీసిన మృగాళ్లను
పిట్టల్లా కాల్చి పారేసాం

ఇంకేం..
వాడవాడలా ఆనంద వీచికలు
ఊరు ఊరూరా ఉత్సవ సందళ్ళు
దేశం నిండా ప్రశంసల జల్లు
మొత్తంగా విజయ గీతాలాపనలు

ఇంతటితో
ఉన్మాదుల వికృత చేష్టలు ఉడిగేనా?
అతివ రెక్కలు విచ్చుకు స్వేచ్ఛగా ఎగిరేనా?

ఎన్‌కౌంటర్ చేస్తేనో..
జైళ్లలో ఖైదీగా బందిస్తేనో..
ఉరికొయ్యకు వేలాడేస్తేనో..
సమస్య పరిష్కారమైతే
లెక్కకు మించి దారుణాల పునరావృతమేలా?
కన్నవాళ్ళ కన్నీటి సంద్రం ఉప్పొంగుట ఎలా?

వేళ్ళకు సోకిన ‘తెగుళ్లు’ తొలిస్తేనే..
పంటచేలు పచ్చగా చిగురించేది

మనసున అంకురించు ‘విష’బీజాల
వినాశనం చేస్తేనే ‘మనిషితనం’ పండేది

ప్రాణాలు తోడెయ్యటం కాదు
పాప చింతనలను అంతం చేయాలి
నివారణ కాదు ‘నిరోధం’ అనివార్యం

ఇప్పుడు చేయాల్సిందల్లా..
మనిషిని ‘మృగం’ చేయు
మద్యం ధారకు అడ్డుకట్ట వేయాలి

అశ్లీలతను కుమ్మరించు అంతర్జాల
మహమ్మారి ‘కోరలు’ తెంచాలి

పాశ్చాత్య పోకడల ‘ఊడలు’ పెరకాలి
సామాజిక అంతరాల ‘వంతెన’ కూల్చాలి

నైతిక, మానవ విలువల బోధన
ఇంటి నుండే మొదలవ్వాలి

మహిళా సంరక్షణే ధ్యేయంగా
ప్రతి అడుగూ ముందుకు సాగాలి..

అప్పుడే..
‘స్ర్తి’ జాతికి విముక్తి

- కోడిగూటి తిరుపతి 95739 29493