AADIVAVRAM - Others

రామాయణం - మీరే డిటెక్టివ్ 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు హరికథకి ఆశే్లష వెంట అతని నానమ్మ మీనమ్మ కూడా వచ్చింది. హారతి ఇచ్చి రాముడికి కొబ్బరికాయ కొట్టాక హరికథకుడు కథని మొదలుపెట్టాడు. ఆయన చెప్పేది మీనమ్మ కూడా శ్రద్ధగా వినసాగింది.
‘దశరథుడికి నలుగురు ఉత్తమమైన కొడుకులు పుడతారని ఋష్యశృంగుడు చెప్పాడు. వసంత ఋతువు వచ్చింది. దశరథ మహారాజు తల పెట్టిన అశ్వమేథ యాగానికి సంబంధించిన మొదటి భాగం పూర్తయి ఆర్నెల్ల తర్వాత గుర్రం తిరిగి వచ్చింది. వెంటనే అన్ని సంబారాలని సమకూర్చారు. ఆరు మారేడు, ఆరు చండ్ర, ఆరు పనస, రెండు దేవదారు, ఓ శే్లష్మాతక కర్రతో చేసిన, ఎనిమిది అంచులు గల మొత్తం ఇరవై ఒక్క శిల్పులు అందంగా చెక్కిన యూప స్తంభాలని నిలబెట్టారు. గరుడాకార వేదికని చిత్యాగ్ని కోసం నిర్మించారు.
‘లోకంలోని ధార్మికులైన రాజులు అందర్నీ ఆహ్వానించారు. దశరథుడు స్వయంగా కాశీ, కేకయ, అంగ, సింధు మొదలైన దేశాల రాజులని ఆహ్వానించాడు. వారి కోసం ప్రత్యేకంగా వసతి గృహాలని నిర్మించారు. సరయూ నది దక్షిణ తీరంలో నిర్మించిన యాగశాలలో ఋష్యశృంగుని ఆధ్వర్యంలో మంత్రాలతో యాగం ఆరంభించారు. యాగం జరిగినంత కాలం ప్రజలంతా తృప్తిగా రుచికరమైన భోజనం చేశారు. వివిధ దేశాల నించి వచ్చిన వారికి, బ్రాహ్మణులు, దాసులు, మునులు, సన్యాసులకి అన్న, వస్తద్రానాలు జరిగాయి.
‘సుమిత్ర యూపస్తంభానికి కట్టిన గుర్రానికి ప్రదక్షిణ చేసి మూడు కత్తులతో మంత్రోక్తంగా దాన్ని చంపింది. అలా అశ్వమేథ యాగాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేశారు. మొదటి రోజుకి చతుష్టోయం అని, రెండో రోజుకి ఉక్థ్యమని, మూడో రోజుకి అతిరాత్రం అని పేరు. యాగానంతరం దశరథుడు తన భూమిని అంతటినీ ఋత్విక్కులకి దానం చేశాడు. వారు దాన్ని ‘్భమిని రక్షించగలిగేది దశరథుడే’ అని చెప్పి ఆయనకి తిరిగి ఇచ్చేసి, దాని బదులుగా దశరథుడు ఇచ్చిన పది లక్షల ఆవులని, వంద కోట్ల బంగారు నాణెలని, నాలుగు వందల కోట్ల వెండి నాణాలని స్వీకరించి, వాటిని ఋష్యశృంగుడికి, వశిష్ఠుడికి ఇచ్చేశారు. ఆ ఇద్దరూ తమకి వద్దని, బ్రాహ్మణులంతా కలిసి ఆ సొమ్ముని పంచుకోమని చెప్పారు.
తర్వాత ఋష్యశృంగుడు దశరథుడి చేత పుత్రీయేష్ఠి యాగాన్ని చేయించాడు. ఆ యాగ ఫలాలని స్వీకరించిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి ఇలా మొర పెట్టుకున్నారు.
‘నీ వర ప్రసాదంతో రావణుడనే రాక్షసుడు ముల్లోకాలని పీడిస్తున్నాడు. ముఖ్యంగా స్ర్తిలని, యజ్ఞయాగాదులని చేసే బ్రాహ్మణులని. అతన్ని చంపే ఉపాయం ఆలోచించు’
‘అలాగే. రావణుడు నన్ను దేవ, దానవ, రాక్షస, గంధర్వ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం అడిగాడు. కాని మనిషి మీద చులకనతో మనిషి చేత చంపబడకూడదని అడగలేదు’
అప్పుడు వారంతా వైకుంఠానికి వెళ్లి విష్ణువుని కలిశారు.
‘రావణుడ్ని చంపడానికి దశరథుడి ముగ్గురు భార్యలకి నలుగురు కొడుకులుగా జన్మించు’ బ్రహ్మ, దేవతలు విష్ణువుని కోరారు.
‘అలాగే. ఆ లోక కంటకుడ్ని చంపి, పదకొండు వందల సంవత్సరాలు భూమిని పాలిస్తాను’ విష్ణువు అంగీకరించాడు.
(బాలకాండ సర్గ 14 నించి 15 దాకా)
హరికథ విన్నాక మీనమ్మ లేచి చెప్పింది.
‘కథని బాగా చెప్పారు. కాని మీరు కొన్ని తప్పులు చెప్పారు. చిన్నప్పటి నించి వాల్మీకి రామాయణం వందల సార్లు పారాయణం చేయడం వల్ల నాకు ఆ తప్పులు తెలిసాయి. వాటిని చెప్తాను వినండి’
డిటెక్టివ్‌గా మీరు కూడా ఆ ఏడు తప్పులని కనుక్కోగలిగారా?
***

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.అమరావతిని పాలించింది కుబేరుడు కాదు ఇంద్రుడు.
2.ఉత్తమ ఏనుగులు సింధు పర్వతాల్లోంచి కాదు తెప్పించింది. వింధ్య పర్వత ప్రాంతాల నించి. సింధు దేశం ఉత్తమాశ్వాలకి ప్రసిద్ధి.
3.దశరథుడి పురోహితుడు కశ్యప మహర్షి కాదు. వశిష్ఠ మహర్షి.
4.దశరథుడు చేయతలపెట్టిన యాగం పుత్రకామేష్ఠి కాదు. అశ్వమేథ యాగం.
5.వంగ దేశంలో జరిగింది అతివృష్టి కాదు అనావృష్ఠి.
6.ఋష్యశృంగుడు రాగానే వర్షాలు ఆగడం కాదు. వర్షాలు కురిసి క్షామం అంతం ఐంది.
7.దశరథుడు పుట్టింది చంద్రవంశం కాదు. ఇక్ష్వాకు వంశం.
***
మీ ప్రశ్నకి జవాబు
శ్రీరాముడి కొడుకు లవుడు నిర్మించిన ఊరు పేరు లవప్రదం. అదే పాకిస్తాన్‌లోని నేటి లాహోర్!
***
మీ ప్రశ్న
శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పేరు ఏమిటి? అది ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా?

-మల్లాది వెంకట కృష్ణమూర్తి