Others

సొంత వైద్యం వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలస్యం అమృతం విషం అంటారు. కానీ దాన్ని ‘అలక్ష్యం ఔషధం విషం’ అని మార్చుకోవచ్చు. వైద్యుల సిఫార్సుతో వాడితే అద్భుతంగా పనిచేసే దివ్యౌషధాలు సైతం.. ఇష్టం వచ్చినట్లు వాడితే తీవ్ర పరిణామాలే కలిగిస్తాయి.
అస్సలు వైద్యుల ప్రమేయం లేకుండా తలనొప్పికి అనాల్జిన్, ఆస్పిరిన్, జ్వరానికి పారాసెట్‌మాల్.. గుండెనొప్పికి, కాన్సర్లకు ఆస్పిరిన్.. ఇలా సొంత వైద్యంతో మందులు మితిమీరి వాడుతున్నారు. ఆధునిక మందులన్నీ రసాయనాలే. వైద్యుల సలహాలు లేకుండా ఇవి మింగితే విషంతో సమానం.
‘‘ప్రొద్దుటినుంచి కడుపులో బాగా నొప్పిగా ఉంది. మంచి టాబ్లెట్ ఇవ్వండి.. గొంతు బాగా వాచింది.. నీళ్ళు కూడా మింగుడు పటట్లేదు.. రెండు ఎరిత్రోమైసిన్ టాబ్లెట్స్ ఇవ్వండి’’- ఏ మందుల షాపులకెళ్లినా కనబడే దృశ్యాలివి.. వినబడే మాటలివి.
ఇరుగింట్లోనో, పొరిగింట్లోనో ఎవరికో మలేరియా వచ్చిందని తెలియగానే అందరికన్నా ముందుగా వాలిపోయి ముందు జాగ్రత్త అంటూ మందులు మింగేసే సొంత డాక్టరు బాబాయిలు సంగం నుంచి సిలికాన్‌దాకా కొదవే లేదు.
చాలాసార్లు ఆ సలహాలు బాగానే పనిచేస్తాయి కానీ ఒక్కోసారి విపరిణామాలకు దారితీస్తాయి. ఎందుకంటే ఒకరికి సరిపోయిన డోసు మరొకరి శరీర తత్వానికి ఎక్కువ అవుతుంది. కొంతమందికైతే అస్సలు పడదు.
అసలు సొంత వైద్యానికి అనేక కారణాలున్నాయి. ప్రజల అమాయకత్వం, అన్నీ తెలిసినా వారి నిర్లక్ష్యం.. ఎంత రోగమైనా ఇట్టే తగ్గాలనే తత్వం, ప్రభుత్వ వైద్యసేవల్లో లోపం, చిన్నా చితకా అనారోగ్యానికి ప్రైవేట్ డాక్టర్ల చేతిలో పోసే స్థోమత లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మందుల షాపులను ఆశ్రయించాల్సి వస్తుంది. సొంత వైద్యాన్ని తీసుకోవాల్సి వస్తుంది.
అసలు ఆధునిక మందులన్నీ విషంతో సమానం. కావాలంటే చూడండి.. ఏ మందు తీసుకున్నా అతి తక్కువ మోతాదులోనే అయినా రసాయనాలు ఉంటాయి. అలాంటి మందులను వైద్యులు సిఫారసుతో వాడినప్పుడే రోగుల విభిన్న శరీర తత్వాలను బట్టి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో చెప్పడం కష్టం. మరలాంటివాటిని సొంతంగా వాడటం ఎంత ప్రమాదకరం. అలాగని చిన్న చిన్న తలనొప్పులకు కూడా వైద్యుణ్ణి సంప్రదించాల్సిన అవసరం లేదు.
నిజానికి మామూలు తలనొప్పి, జ్వరం లాంటి తేలికపాటి అనారోగ్యాలు ఏ మందు తీసుకోకపోయినా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఎంతటి రోగమైనా మంత్రించినట్టు మాయమవ్వాలన్న కోరికలతో మందులు వాడతారు. చిన్నపాటి అనారోగ్యాలకు ఒకటి, రెండు టాబ్లెట్లు వాడటం తప్పు కాదు. కానీ తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.
చిన్నపాటి అనారోగ్యాలకు అల్లోపతి వైద్యం కన్నా వంటింటి వైద్యమే మిన్న. ఉదాహరణకు చంటిపిల్లలకు కడుపునొప్పి వస్తే తమలపాకుకు ఆముదం రాసి దాన్ని వెచ్చబెట్టి పొట్టమీద పెట్టండి. పెద్దవాళ్ళకు కడుపునొప్పి వస్తే కాస్త వామూ, ఉప్పూ కలిపి నమిలి వేడినీళ్ళు తాగాలి. గొంతు ఇన్‌ఫెక్షన్‌కి గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం, విరోచనాలు తగ్గడానికి పెరుగులో మెంతులు నానబెట్టి తినడం, అరుగుదలకు కరివేపకు, పసుపు, ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి పరగడుపునే కుంకుడుగింజంత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
ఇలా ఎన్నో వున్నాయి. పైగా వీటివల్ల మన అనారోగ్యం తగ్గినా తగ్గపోయినా దుష్ప్రభావాలైతే ఉండవు. వాటికీ తగ్గపోతే మాత్రం ఒకటి రెండు మాత్రలు వేసుకోవచ్చు. అయినప్పటికీ ఉపశమనం లభించకపోతే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి తప్ప తగ్గేదాకా చూద్దాం అనుకుంటూ అదేపనిగా సొంత వైద్యం తీసుకుంటూ, లేనిపోని మందులు వాడి ప్రాణాలమీదకు తెచ్చుకోకూడదు.
అలాగే ఆయుర్వేద మందులు వాడేవారు వైద్యుల అనుమతి లేకుండా అల్లోపతి మందులు అస్సలు వేసుకోకూడదు. వైద్యున్ని సంప్రదించకుండా గర్భిణీలు, చిన్నపిల్లలు, బాలింతలు, వృద్ధులు స్వంత వైద్యం చేయనేకూడదు. అది ఎన్నో విపత్కర పరిణామాలకు దారితీస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!

- కంచర్ల