Others

పెదాలు మృదువుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలంలో పెదాలు పగలడం, పొడిబారడం వంటి సమస్యలతో అందవిహీనంగా కనిపిస్తుంటాయి. ఇంట్లో చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో కూడా పెదాలు పగలకుండా, తేమతో మృదువుగా కాంతులీనుతూ ఉంటాయి.
* రోజూ రాత్రి పడుకునేముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. పెదాలు తగిన తేమతో కాంతులీనుతూ ఉంటాయి.
* గుప్పెడు గులాబీరేకుల్ని ముద్దగా చేసుకుని దానికి చెంచా వెన్న కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల బాదం నూనె చేర్చి పెదాలకు రాసుకుంటే మృదువుగా కనిపిస్తాయి. పొడిబారడం తగ్గి పెదాలు పగిలే సమస్య దూరమవుతుంది.
* కొందరికి పెదాలు నల్లగా ఉంటాయి. ఇలాంటివారు తేనె, పంచదార, ఆలివ్‌నూనెల మిశ్రమాన్ని పెదాలకు రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగిపోతాయి. నలుపుదనం తగ్గుతుంది. అందంగానూ కనిపిస్తాయి.
* బీట్‌రూట్ రసాన్ని ఉదయానే్న పెదాలకు రాసుకుంటే నునుపుదనం వస్తుంది. పెదవులు లేత గులాబీరంగులోకి మారతాయి.
* కొత్తిమీర, క్యారెట్ రసాలను సమాన పరిణామంలో తీసుకుని బాగా కలపాలి. రోజూ రాత్రిపూట ఈ మిశ్రమాన్ని రాసుకుంటే పెదాలు మరింత మృదువుగా తయారవుతాయి. అందంగా ఉంటాయి. *