Others

ఉప్పు చట్టాల ధిక్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదల చేసిన తర్వాత అతనికి ఘనమైన స్వాగత సత్కారాలు ఏర్పాటుచేసి ‘ఉల్లిపాయల దొంగ’ అని బిరుదిచ్చారు. గాంధీ ఈ సభలో స్వయంగా పాల్గొని అతని నుదుటిన విజయ తిలకం దిద్దాడు.
మరో సందర్భంలో కాటకం ఏర్పడినపుడు గాంధీ రైతులకు ఇలాంటి సూచనే ఇచ్చాడు. భూమిశిస్తు ఆదాయం కోల్పోవడం ప్రభుత్వ అధికారులకు ఆగ్రహం తెప్పించింది. రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకొని, గుడిసెల నుంచి వారిని వెళ్లగొట్టారు. రైతులు వారికున్న కొద్దిపాటి వస్తువులు తీసుకొని తమ తాతల నుంచి వస్తున్న ఇళ్లు ఖాళీ చేసి వలస వెళ్లారు. స్వాధీనం చేసుకున్న ఇళ్లను వేలం వేయాలని అధికారులు ప్రయత్నించారు. కానీ వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సుదీర్ఘమైన విచారణ తర్వాత రైతుల డిమాండ్లను పాక్షికంగా అంగీకరించి, ఆ ఏడాదికి పన్నులు మినహాయించారు.
చంపారన్‌లో రైతులు నీలిమందు పండించి తీరాలని తెల్ల యజమానులు బలవంతం చేశారు. వారికి సక్రమంగా వేతనాలివ్వలేదు. రైతులతో బలవంతపు చాకిరీ చేయిస్తూ వాళ్ళు భారీ లాభాలు సంపాదించారు. వేధింపులకు గురైన ఒక రైతు సహాయం కోసం గాంధీ వద్దకు వచ్చాడు. గాంధీ చంపారన్‌కు వెళ్ళాడు. సమస్య వివరాలను తెలుసుకున్నాడు. ఈ సమస్యను పరిష్కరించాలని నిశ్చయించుకున్నాడు. సుదీర్ఘమైన సంప్రదింపులూ, ఆందోళనా జరిగాయి. చివరకు దుర్మార్గమైన నీలిమందు సాగు పద్ధతి ఆగిపోయింది. రైతుల కోసం యజమానులు తమ భారీ లాభాలను వదులుకోవాల్సి వచ్చింది. చంపారన్‌పై వందేళ్లుగా పడిన నల్లటి మరక తొలగిపోయింది.
భారతదేశంలోని ఒక అణా తలసరి ఆదాయంతో పోల్చినపుడు ఉప్పు పన్ను భరించలేనిదిగా ఉంది. గుక్కెడు గంజిలో చిటికెడు ఉప్పువేసుకొని జీవించే కోట్లాది మంది పేదలు కూడా ఈ భారీ పన్నుకు బాధితులు కాక తప్పడంలేదు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉప్పునీటి కయ్యల నుంచి, ఉప్పురాళ్లనుంచి సహజమైన ఉప్పు తయారుచేసుకొనే అవకాశం ఉంది. కానీ చట్టం ఉప్పు తయారీని నిషేధించింది. దీనికి నిరసనగా గాంధీ ఉప్పు ఉద్యమాన్ని ప్రారంభించాడు. ‘‘నేను కోరుకొన్నది సాధించి తిరిగి వస్తాను, లేదా నా శవం సముద్రంలో తేలుతుంది. మరణిస్తే వీరస్వర్గానికి వెళతాం, అరెస్టయితే జైలుకి వెళతాం లేదా ఇంటికి విజయంతో తిరిగొస్తాం’’. సబర్మతీ ఆశ్రమం నుంచి ఆయన 241 మైళ్ళు, 25 రోజులపాటు పాదయాత్ర చేసి, దండి సముద్ర తీరంలో ఉప్పును తయారుచేసి అప్పటి ఉప్పు చట్టాలను ధిక్కరించాడు. శాసనాన్ని ఉల్లంఘించిన గాంధీకి సరోజినినాయుడు దండ వేసి తిలకం దిద్దింది. ‘‘ఏదో కొద్దిగా ఉప్పును స్వాధీనం చేసుకోవడం చిన్నపిల్లల పని. నేను మొత్తం ఉప్పునంతా స్వాధీనం చేసుకోబోతున్నాను’’ అన్నాడు గాంధీ. ఆయన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు నిషేధిత ఉప్పును సమీకరించడం ప్రారంభించారు. రహస్యంగా నిల్వ ఉంచి రవాణా చేస్తున్న ఉప్పుకోసం పోలీసులు తీవ్రంగా వెదకసాగారు. చివరకు జమీందారిణులు, పెద్ద కుటుంబీకుల మహిళను తీసుకువెళ్ళే పల్లకీలను కూడా తనిఖీ చేశారు. ఒకసారి కారులో వెళ్తున్న గాంధీ దారిలో వున్న పోలీసులను చూసి, ‘‘నా కారులో ఉప్పు తీసుకెళుతున్నాను? ఆపి పట్టుకుంటారా?’’ అని వేళాకోళం ఆడాడు.
గాంధీ ధరసాన అనే ఊళ్ళోని ఉప్పు డిపోపై దాడి చేయాలనుకున్నాడు. అనుకోకుండా ఆయన్ని అరెస్టు చెయ్యడంతో పథకం దెబ్బతింది. ఆయన అనుచరులైన అహింసా సైన్యం ఉప్పు డిపోలోకి దూసుకువెళ్లింది. కాపలావారికీ, కార్యకర్తలకూ మధ్య తీవ్రయుద్ధం జరిగింది. ఇనుప తొడుగులు వేసిన లాఠీలతో కార్యకర్తలను పోలీసులు కొట్టారు. కొందరికి ఎముకలు విరిగాయి, కొందరికి తలలు పగిలాయి. రక్తం ధారలుగా కారింది. అదేసమయంలో భారతదేశంలోని ఇతర ఉప్పు డిపోలమీద కూడా ఇలాంటి దాడులు జరిగాయి. ఒక ఏడాది తర్వాత ఉప్పు చట్టాన్ని సవరించారు. గృహోపయోగం కోసం ఉప్పును తయారుచేయడం, సమీకరించడం, ఉప్పు నిల్వలు సమీపంలో వున్న గ్రామాలలో అంతర్గతంగా ఉప్పు వ్యాపారం చేయడం చట్టబద్దమయ్యాయి.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614