AADIVAVRAM - Others

వర్ణకారిణి ఈ ‘వేకువ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్వాస్, కాగితంపైగాక కొత్త తీరాలకు చిత్రకళ చేరుకుందని, ఆ నూతన తీరాలను తాకడమే నేటి చిత్రకారుల కర్తవ్యమని భావించి, ఆ సరికొత్త వేకువ వెలుగులను ముద్దాడాలని తహతహలాడే వినూత్న భావాల, విశేష అవగాహన గల చిత్రకారులకు వర్ధమాన చిత్రకారిణి ‘వేకువ’ ప్రాతినిధ్యం వహిస్తోంది.
అబ్బురపరిచే ఆలోచనలతో, మనసు పలికే మాటలకు రంగులు - రేఖలు జతచేసి సరికొత్త రంగుల ప్రపంచాన్ని సృష్టించేందుకు తాము ఈ భూమీద శ్వాసిస్తున్నామని విశ్వసిస్తూ, సరికొత్త ‘వేకువ’ను ఆవిష్కరించేందుకు తమ మేథను రంగరించి రంగుగా మార్చి ఆ ప్రయోగాలను పది మంది ముందు పరిచేందుకు తమ శక్తినంతా కూడదీసుకుని కదులుతున్న వర్తమాన చిత్రకారుల, మెరుపు తీగల ప్రతినిధి అందె వేకువ.
అలాగని వేల సంవత్సరాల సంప్రదాయ చిత్రకళను పట్టించుకోరా?.. అని ప్రశ్నిస్తే, అలాంటిదేమీ లేదు, ఆ చరిత్రనంతా ఔపోసన పట్టి, గుప్పిట్లో పట్టి నాల్గవ పారిశ్రామిక విప్లవం వెలుగులో వెల్లువెత్తిన సాంకేతిక పరిజ్ఞానం, జ్ఞానం, భావ విస్ఫోటనం సమకాలీన చిత్రకళలో కనిపించాలని వారి భావన, అభిమతం.
ఈ తరహా విప్లవాత్మక ప్రయోగానికి, భావ వ్యక్తీకరణకు అందె వేకువ తాను చదువుతున్న మాసాబ్ ట్యాంక్‌లోని ‘ఫైన్ ఆర్ట్స్ కాలేజీ’నే వేదిక చేసుకున్నారు. కళాశాలలోని కొంత భాగం ఎంపిక చేసుకుని గోడలకు, మెట్లకు నియాన్ పెయింట్ చేసి, చీకట్లో అల్ట్రా వయొలెట్ లైట్స్ ఆధారంగా వేల సంవత్సరాల ప్రపంచ చిత్రకళా చరిత్రను క్లుప్తంగా తన మిత్రుడు - చిత్రకారుడు సతీష్‌తో కలిసి పొందుపరిచారు. ఈ సరికొత్త ‘గ్లో ఆర్ట్’కు ఆమె, సతీష్ సరికొత్త నిర్వచనం చెప్పి చిత్రకళా రంగంలో ఓ సరికొత్త సంచలనం సృష్టించారు. వర్తమాన చిత్రకారుల ఆలోచనల మెరుపు అలలకు ఈ ప్రయోగం ఓ సంకేతం.
ఆదిమ మానవుడు గుహల్లో సహజ రంగులతో చిత్రించిన ఆకారాలు- ఆకృతుల నుంచి వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవం వరకు జరిగిన మానవ పరిణామంతోపాటు చిత్రకళ పరిణామ క్రమాన్ని చిత్రిక పట్టి చూపరులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ ప్రయోగం స్వల్ప బొమ్మలతో, భావాలతో అనల్ప అర్థం స్ఫురించేలా అటు చిత్రకారులను, ఆర్ట్ లవర్స్‌ను, సాధారణ వీక్షకులను ఆకట్టుకుంది. చిత్రకళా రంగంలో ప్రయోగాలకు, పరిణతకు హైదరాబాద్ నగరం వెనుకబడి లేదని చాటి చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.
జ్వలించే తపనతో, నవ నవోనే్మష ఆలోచనలతో నిరంతరం రంగులతో - రేఖలతో ‘నడక’ సాగించడం వల్ల, నిజాయితీగా ముందుకు సాగడం వల్ల సరికొత్త తీరాలను తాకవచ్చని, కొత్త ప్రయోగాలకు తెర తీయవచ్చని, సరికొత్త సృష్టికి పర్యాయపదంగా నిలవవచ్చని నిరూపిస్తున్న చిత్రకారుల్లో ‘వేకువ’ అగ్రభాగాన కనిపిస్తారు. చిత్రకళలో సరికొత్త వేకువను ముద్దాడాలనుకునే వారిలోనూ ఈ ‘వేకువ’ ఉషోదయంలా కనిపిస్తుంది.
సతీష్ - వేకువ తమ ‘గ్లో ఆర్ట్’తో మసక చీకట్లో రంగుల ప్రపంచానే్న గాక ఓ మాయా నగరిని సృష్టించి చూపరులను కట్టి పడేశారు. విభ్రమకు గురిచేసే ఆ వేదికకు ‘ఎక్స్ వై జెడ్ లాబొరేటరీస్’ అన్న శీర్షిక పెట్టి తాము చేసిన ప్రయోగానికి ఆహ్వానం పలికారు. ఆర్ట్ ఇప్పుడు కాగితం, కాన్వాస్‌పై లేదని మరోసారి నిరూపించారు. స్పందింపజేసే లక్షణం, ఆలోచింపజేసే ‘్ఫం’ ‘టెక్నిక్’ టెక్చర్ ‘సర్వాంతర్యామి’ అని చాటి చెప్పారు.
చిత్రకళా రంగంలో గతంలో అనేకానేక సిద్ధాంతాలు, ఇజాలు, పద్ధతులు వెలుగు చూశాయి. అవన్నీ ఆయా కాలాల ఆలోచనా సరళికి అద్దం పడతాయి. వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో, స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ యుగంలో దానికనుగుణమైన పద్ధతులు పురుడు పోసుకుంటాయని బలంగా విశ్వసిస్తున్న వారిలో ‘వేకువ’ ఒకరు.
ఈ గ్లో ఆర్ట్ సృజనకు ముందు ఆమె హైపర్ రియలిజం పద్ధతిలో కొన్ని బొమ్మలు పెన్సిల్‌తో వేశారు. వాటిలో ఓ పండు ముసలి అవ్వ బొమ్మ నిజంగానే హైపర్ రియలిస్టిక్‌గా కనిపిస్తుంది. ముడతలు పడిన చర్మం.. దీనమైన చూపులు, పూర్తిగా నెరసిన వెంట్రుకలు, ముఖంపై పిగ్మెంటేషన్ మచ్చలు ఎంతో నైపుణ్యం కనబరచి చిత్రించారు. అలాగే ఆమె అక్రలిక్ రంగుల్లో బతుకమ్మను చేతపట్టుకున్న మహిళ చిత్రాన్ని వినూత్నంగా చిత్రించారు. మదర్ అండ్ చైల్డ్ చిత్రాన్ని కూడా ఇదే మాధ్యమంలో ఆవిష్కరించారు. వర్తమాన అర్ధనారీశ్వర చిత్రాన్ని వుడ్‌కట్ మాధ్యమంలో చిత్రించారు. వాటర్ కలర్స్‌తోనూ ఆమె రకరకాల పూలను వేశారు. ముగ్ధమనోహరమైన రీతిలో, ఆకర్షణీయంగా చిత్రిక పట్టారు. ఇక వేకువకు ఇష్టమైన మరో మాధ్యమం.. ‘స్క్రాప్ డిజైన్’. అనేక పాత ఇనుప సామానుతో, తుక్కుతో ఆమె ఎన్నో ఆకృతులను రూపొందించారు. ఇందులో గుండుసూదులు, ఉన్ని దారం ముక్కలు, అవసరమైన చోట రంగు ముద్దలు వాడి ‘మిక్స్‌డ్ మీడియా’గా వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కొన్ని ఆకారాలు నైరూప్యంగా కనిపిస్తాయి. ‘మనసు చెప్పిన రీతిలో స్క్రాప్‌కు ఆకారమిచ్చాను తప్ప అదేమిటని అడిగితే నేనేమి సమాధానం చెప్పలేను.. మీ దృష్టి కోణానికి ఆ ఆకారం ఎలా అనిపిస్తే అదే అనుకోవచ్చు.. ఈ స్వేచ్ఛ అటు సృష్టికర్త అయిన చిత్రకారుడికి (శిల్పికి) ఉంది. ఇటు దాన్ని చూసే వీక్షకుడికీ ఉంద’ని ఆమె అంటున్నారు.
ఇలా విభిన్న పద్ధతుల్లో, మాధ్యమాల్లో తన సృజనను, నైపుణ్యాన్ని, కొత్త ‘చూపు’గల అందె వేకువ హైదరాబాద్‌లో 1996లో జన్మించారు. ఆమె తండ్రి సహజకవి, వాగ్గేయకారుడిగా గుర్తింపు పొందిన అందెశ్రీ. ఆ భావుకతను, రసాత్మకతను, ఉపమాన వైవిధ్యాన్ని ఆమె తన తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నారనిపిస్తోంది. బాల్యం నుంచే బొమ్మలపై ఆసక్తి ఉండటం, అక్కడి ఉపాధ్యాయులు చిత్రకళపై ఆసక్తి ఉన్నవారిని ఎక్కువగా ప్రోత్సహించడంతో ఇంటర్‌మీడియట్‌కు వచ్చేసరికి చిత్రకళ తనలో ఓ భాగమైందని, అందుకే 2014 సంవత్సరంలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్‌ఏ కోర్సులో చేరానని వేకువ చెప్పారు. కాలేజీలో చేరాకనే ఆర్ట్‌కు ఓ సిద్ధాంతం ఉంటుందని, సిస్టమ్ ఉంటుందని తనకు బోధపడిందని కూడా ఆమె అంటున్నారు. స్టిల్ లైఫ్, పోట్రేట్స్, స్కల్‌ప్చర్, అప్లయిడ్ ఆర్ట్ ఇట్లా అనేక అంశాలతోపాటు ‘హిస్టరీ ఆఫ్ ఆర్ట్’లో మొత్తం ప్రపంచం ఇమిడి ఉంటుందని అది చిత్రకారుడి జ్ఞాన చక్షువులు తెరచుకునేలా చేసిందని చెప్పారు.
ఇండియన్ ఆర్ట్, వెస్ట్రన్ (పాశ్చాత్య) ఆర్ట్ పరిణామాలు, ఇజాలు, వాటి రూపకర్తలు.. వారి జీవితం కళ్ల ముందు పరచుకుంటుందని, అదెంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, ఆ చరిత్రనే ముందుకు నడుపుతుందని కూడా ఆమె చెబుతున్నారు.
అదే కాలేజీలో ప్రస్తుతం ఎంఎఫ్‌ఏ చేస్తూ ఆఖరి పాదంలో ఉన్నానని, వివిధ వస్తువులను, పరికరాలను ఎలా ‘ఆర్ట్’ కోసం వాడాలి?.. ఉపయోగించాలనే జిజ్ఞాసతో, ఆలోచనా ప్రక్రియ (్థట్ ప్రాసెస్)లో ఉన్నానని, మెటల్.. స్క్రాప్ (ఇనుప సామాగ్రి)తో మెటల్ బీటింగ్ ఆర్ట్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న తపనతో కదులుతున్నానని ఆమె చెబుతున్నారు.
‘వర్ణకారిణి’గా, సృజనకారిణిగా, ప్రయోగశీలిగా ఇటీవల అజంతా గుహల వద్ద జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొని సంప్రదాయ చిత్రకళను ఆధునిక చిత్రకళతో ఎలా మేళవించడానికి వీలుందో తన విద్యార్థి సహచరులతో, అధ్యాపకులతో కలిసి మేథోమథనం చేశారు. జీవితాంతం నేర్చుకునే, ప్రయోగం చేసే, పరిశోధించేదే చిత్రకళ అని ఆమె తన మనసులోని మాటను వెల్లడించారు. చిత్రకళ ఇప్పుడు కాగితం, కాన్వాసుపై నుంచి కదిలి మెటీరియల్ (వివిధ వస్తువులు) వైపు మళ్లిందని, అందుకే మెటల్ బీటింగ్ ఆర్ట్ వైపు అడుగులేస్తున్నానని, నవీనత, సృజన, ప్రయోగం తన ఊపిరి’ అని ‘నియాన్ రంగు’లా వెలిగిపోతూ ఆమె వెల్లడించారు.
అందె వేకువ 76800 10836

-వుప్పల నరసింహం 9985781799