AADIVAVRAM - Others

శుభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో సినిమాలు ‘శుభం’ అన్న అక్షరాలతో ముగిసేవి. అది విషాద సినిమా అయినా చివర్లో ఆ అక్షరాలే కన్పించేవి. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. కొన్నిసార్లు ఆ చిత్రంలో పనిచేసిన తారాగణం పేర్లతో ముగిస్తే మరికొన్ని ‘ఇంకా ఉంది’ అనో ఇంకా ఏదోఏదో అని ముగుస్తాయి.
సినిమా కథలో ఎన్ని మలుపులు ఉన్నా, ఎంత విషాదం వున్నా చివరికి శుభం జరగాలని అందరూ కోరుకునేవారు. ఇది మనిషి ఆలోచనా పద్ధతి. చిన్నప్పుడు విన్న కథల్లోగానీ, పిల్లలకు చెప్పిన కథల్లో గానీ కథ చివర్లో సుఖాంతమయ్యేది. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు చివరికి సుఖాంతమయ్యే కథలే పిల్లలకి చెబుతారు. అలాంటి కథల్నే చదువమని పిల్లలకి ఇస్తారు.
కథలన్నీ సుఖాంతంతోనే ముగియకపోవచ్చు. జీవితాలు కూడా సుఖాంతంగా ముగియకపోవచ్చు. కానీ సుఖాంతంగా ముగియాలని కోరుకుంటాం.
మనం ఏ ఊరికి ప్రయాణం చేసినా రోడ్డు నేరుగా ఉండదు. ఎత్తు వొంపులు లేకుండా ఉండదు. వంకర్లు మలుపులు ఎన్నో దాటుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎత్తు ఒంపులు లేకుండా రోడ్డు ఉండదు. ఎంతటి గొప్ప కారులో ప్రయాణం చేసినప్పటికి ఎత్తివేయడాలు తప్పవు. జీవితం కూడా అంతే! అనుకోని మలుపులతో, ఉత్కంఠలతో, ఆశ్చర్యాలతో జీవితం కొనసాగుతుంది. ఇవేవీ లేకుండా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది.
చాలా మంది భవిష్యత్తు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూంటారు. జ్యోతిషుల దగ్గరికి, స్వాముల దగ్గరికి వెళ్తూంటారు. తమ జీవితం ఎలా ఉండబోతుంది. ఎన్ని మలుపులు తిరుగుతుంది. ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు తెలిస్తే ఏం ఉంటుంది. అసంతృప్తి తప్ప మరేమీ ఉండదు.
చివరి బంతిలో ఎవరు గెలుస్తారో తెలియనప్పుడు ఉండే మజా ఆ తరువాత ఉండదు. ఆట అయిపోయిన తరువాత ఆట చూస్తే ఏం ఉంటుంది? ఎలాంటి ఉద్వేగాలు లేకుండా చూస్తాం. చూసిన సినిమాని మళ్లీ చూస్తే కూడా ఎలాంటి స్పందనా ఉండదు. జీవితమూ అంతే! భవిష్యత్తు తెలిసిన వాళ్లకి (ఒకవేళ నిజంగా తెలిస్తే) భవిష్యత్తు నిస్తేజంగా ఉంటుంది.
జీవితంలో శుభం కార్డు పడుతుందా? సశేషం పడుతుందా? ఏ మలుపులు ఉన్నాయో అనుభవించాలి తప్ప తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు.
జీవితం అనేది ఓ ఆట. ఆడుతూనే ఉండాలి. గెలుపూ ఓటములు మన చేతిలో పూర్తిగా ఉండవు.
జీవితం అనేది ఓ మార్పు. అది అనుక్షణం మారుతూనే ఉంటుంది. శుభం కార్డు ఊహించడం మంచిదే!