Others

మనసుంటే మార్గాలు కోకొల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుండాలే కానీ మార్గాలు కోకొల్లలు.చేసే పనిమీద మనసును లగ్నం చేస్తే అన్ని సఫలం అవుతాయి. ‘చిత్తం శివునిమీద, భక్తి చెప్పులమీద’ అన్నట్లుగా ఉంటే ఫలితం ఉండదు. మనం చేసే ఏ పనిమీదనైనా సూక్ష్మదృష్టి పెట్టి చేస్తే అది ఫలవంతమవుతుంది. ‘సంకల్ప బలం’ ఉండి ఏకాగ్రతతో ఏ పని చేసినా చివరికి దాని ఫలితం లభిస్తుంది.కశ్యప మహామునికి దితి, అదితి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. దితి సంతానం రాక్షసులు, అదితి సంతానం దేవతలు. వీరు నిరంతరం యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి వారు గెలిస్తే మరోసారి వీరు గెలిచేవారు. అలా కొనసాగుతుండగా, రాక్షస గురువైన శుక్రాచార్యుడు తపస్సు చేసి ‘మృత సంజీవని’ విద్యను సాధించాడు. ఆ విద్య కారణంగా యుద్ధంలో మరణించిన రాక్షసులందరినీ తిరిగి బతికించసాగాడు. అప్పటికి దేవతలు ఇంకా ‘అమృతపానం’ చెయ్యలేదు. అందువల్ల వారు మరణించిన వారిని బతికించలేకపోయారు.
ఎలాగైనా ఆ విద్యను సాధించాలనే ఉద్దేశ్యంతో దేవ గురువైన బృహస్పతి తన కుమారుడైన కచుని పిలిచి శుక్రాచార్యుల దగ్గర మృతసంజీవని విద్యను నేర్చుకురమ్మని పంపాడు. కచుడు శుక్రాచార్యుని వద్దకు వచ్చి ప్రవర చెప్పుకొని విద్య నేర్చుకోవటం ప్రారంభించాడు. అనతికాలంలోనే గురువుకి ఇష్టుడయ్యాడు. అది చూసి మిగతా శిష్యులందరికీ కంటగింపుగా మారింది. వారి మనసు ఈర్ష్య అసూయలతో నిండిపోయింది. ఎలాగైనా కచుని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు పథకం ప్రకారం అతనిని హతం చేసి, కాల్చి బూడిద చేసి ఆ బూడిదను గురువుగారికి సురలో కలిపి ఇచ్చారు.
విషయం తెలియని గురువుగారు సురాపానంచేశారు. ఇంతలో కుమార్తె అయిన దేవయాని వచ్చి కచుడు కనబడలేదు అని వార్త చెప్పింది. దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు. కచుని బతికించడానికి తప్పనిసరి పరిస్థితిలో మృత సంజీవని విద్య నేర్పించాడు. విద్య నేర్చుకున్న కచుడు బయటకు వచ్చి గురువును కూడా బతికించాడు. నేర్చుకోవాలన్న తపన ఉంటే పరిస్థితులు కూడా అలా కలిసి వస్తాయి. తనకున్న అకుంఠిత దీక్ష కారణంగా చనిపోయి కూడా బతికి ఆ విద్యను సాధించాడు.

- చివుకుల రామమోహన్